సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలూ కొన్నిసార్లు సెన్సేషన్ అవుతుంటాయి. ఆ కోవలోకి వస్తున్నాడు సంగీత దర్శకుడు జివి ప్రకాష్ కుమార్. తమిళంలో ఎక్కువ బిజీగా ఉన్నప్పటికీ తెలుగులో చెప్పుకోదగ్గ ఆఫర్లు వస్తున్న ఈ యంగ్ టాలెంట్ ఒకవైపు మ్యూజిక్ చేస్తూనే ఇంకోపక్క హీరోగా నటిస్తూ చాలా బిజీగా ఉన్నాడు. గత ఏడాది తెలుగులో టైగర్ నాగేశ్వరరావు, ఆదికేశవ రెండు ఆల్బమ్స్ తో నిరాశ పరిచినప్పటికీ సార్ రూపంలో బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చాడు. ఇంతకన్నా ముందు ఆకాశం నీ హద్దురా, రాజా రాణి, యుగానికి ఒక్కడు లాంటి సూపర్ హిట్స్ తో మనదగ్గరా ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.
నిన్న సాయంత్రం భార్య సైంధవితో విడిపోతున్నట్టు సోషల్ మీడియా వేదికగా జివి ప్రకాష్ ప్రకటించడం ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని, మానసిక ప్రశాంతత కోసం వేర్వేరుగా ఉండాలని నిర్ణయించుకున్నామని చెప్పడం చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. దీనికి కారణం లేకపోలేదు. సైంధవి, జివిలు స్కూల్ మేట్స్. చిన్నప్పటి నుంచే వీళ్ళ పరిచయానికి పునాది ఉంది. ఎనిమిది సంవత్సరాల ప్రేమ తర్వాత 2013లో మూడు ముళ్ళతో ఒక్కటయ్యారు. 2020లో పాప జన్మించింది. తొలి సంతానం కలిగిన ఇంత తక్కువ సమయంలో డైవోర్స్ అంటే ఆశ్చర్యమే.
సైంధవి, జివి ప్రకాష్ లు వృత్తిపరంగానూ కలిసి పాటలు చేసేవాళ్ళు. ఎన్ హెచ్ 4, నాన్న, సూరారై పోట్రులో ఇద్దరి భాగస్వామ్యం ఉంది. అయినా సరే ఇంత తీవ్ర మనస్పర్థలు రావడం చూస్తే ఏదో బయటికి చెప్పని బలమైన కారణం ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. విడాకులు తీసుకోవడం విచిత్రం కాకపోయినప్పటికీ అంత ఘాడమైన బంధంతో ఒక్కటైన స్నేహితులు కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం చూస్తే సినిమాలను మించిన డ్రామా రియల్ లైఫ్ లో కూడా ఉంటుందని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ అక్కర్లేదేమో. జివి కొత్త బంధం గురించి ఆల్రెడీ కోలీవుడ్ గాసిప్స్ మొదలయ్యాయి.
This post was last modified on May 14, 2024 11:29 am
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…