ఇంకో రెండు రోజుల్లో పోలింగ్ జరగనుంది. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎక్కడ ఉన్నా ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం స్వంత ఊళ్లకు బయలుదేరుతున్న వైనం ప్రతి చోటా కనిపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరాల్లో బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు జనంతో కిక్కిరిసి పోతున్నాయి. ఇదిలా ఉండగా ఈసారి ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల మీద టాలీవుడ్ సీరియస్ దృష్టి పెట్టింది. టిడిపితో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ కు కొందరు బహిరంగంగా మద్దతు ప్రకటిస్తుండగా, మరికొందరు ట్విట్టర్ వేదికగా, ఇంకొందరు తెరవెనుక వివిధ రూపాల్లో తమ ఆకాంక్షను తెలియపరుస్తున్నారు.
ఒకరకంగా చెప్పాలంటే టిడిపి జనసేన కూటమి అధికారంలోకి వస్తే పరిశ్రమకు చాలా ప్రయోజనాలుంటాయనే దిశగా ఇండస్ట్రీ పెద్దలు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ప్యాన్ ఇండియా సినిమాలకు సంబంధించిన టికెట్ రేట్ల పెంపు, స్పెషల్ షోలతో మొదలుపెట్టి తమకు పలు సందర్భాల్లో దక్కుతున్న ట్రీట్ మెంట్ పట్ల పరిశ్రమ వర్గాలు ఏపీ సర్కారు మీద ఎంతో కొంత అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవం. అధికారం వస్తే కనక పవన్ వైపు నుంచి టాలీవుడ్ కు మేలు జరిగే ఎన్నో సంస్కరణలు జరుగుతాయని వాళ్ళ ఆలోచన. అందులో తప్పు బట్టేందుకు ఏం లేదు. సాటి సినిమావాడనే నమ్మకం దానికి ప్రేరేపించింది.
నిర్మాత అశ్వినీదత్ ఓపెన్ గా తెలుగుదేశంకు జై కొట్టేశారు. కల్కి మీద ప్రభావం పడుతుందా అనేంత దూరం ఆయన ఆలోచించడం లేదు. మెగా అల్లు ఫ్యామీలీలు ఆల్రెడీ తమ స్టాండ్ చెప్పేశాయి. ఎస్కెఎన్, సాయి రాజేష్, నాగవంశీ లాంటి నిర్మాతలు మేము సైతం అంటూ నేరుగా ప్రచార బరిలో దిగి జనసేనకు ఓటు వేయమని అడుగుతున్నారు. అలా అని వైసిపి మద్దతుదారులు లేరని కాదు. కానీ కూటమికి బయపడినంతగా జగన్ కు సినీ వర్గాల వైపు నుంచి మద్దతు ఆ స్థాయిలో కనిపించడం లేదన్నది వాస్తవం. చూస్తుంటే టాలీవుడ్ నమ్మకానికి కూడా ఈ ఎన్నికలు ఒక పరీక్షగా మారాయి.
This post was last modified on May 11, 2024 1:25 pm
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…