గతంలో పుష్పలో శ్రీవల్లి పాత్రతోనే ప్యాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్నకు బాలీవుడ్ లో పెద్ద బ్రేక్ ఇచ్చింది మాత్రం రన్బీర్ కపూర్ తో చేసిన యానిమల్. ప్రేమతోనే హింసించే భర్తని భరించే ఆధునిక ప్రియురాలిగా సందీప్ వంగా తనకిచ్చిన షేడ్స్ ని అద్భుతంగా చేసి చూపించింది. అంతకు ముందు మిషన్ మజ్ను, గుడ్ బైలో ఛాలెంజింగ్ పాత్రలు చేసినప్పటికీ అవి ఫ్లాప్ కావడం వల్ల ఆశించిన గుర్తింపు రాలేదు. తాజాగా రష్మికకు కండల వీరుడు సల్మాన్ ఖాన్ సరసన జోడి కట్టేందుకు ఛాన్స్ దొరికినట్టు లేటెస్ట్ అప్ డేట్. అది కూడా క్రేజీ కాంబోలో కావడం గమనార్షం.
ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందబోయే సికందర్ జూన్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. సాజిద్ నడియాడ్ వాలా నిర్మిస్తున్నారు. ముందు కిక్ 2 తీయాలనుకున్నారు కానీ కథ సెట్ కాకపోవడంతో ఆ ఆలోచనని తాత్కాలికంగా పక్కన పెట్టారు. ఈలోగా మురుగదాస్ చెప్పిన లైన్ బాగా నచ్చడంతో దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి పట్టాలెక్కిస్తున్నారు. దాస్ కు హిందీ సినిమాలు కొత్త కాదు. అమీర్ ఖాన్ గజినీ, అక్షయ్ కుమార్ హాలిడే లాంటి మంచి హిట్లు ఆయన ఖాతాలో ఉన్నాయి. రజనీకాంత్ తో దర్బార్ చేశాక దాని ఫలితం వల్ల సౌత్ స్టార్లు ఆయనతో చేసేందుకు అంత సుముఖత చూపించలేదు.
రష్మిక ఎంట్రీ గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టేనని యూనిట్ టాక్. ఇది కనక హిట్ అయితే డబుల్ జాక్ పాట్ కొట్టినట్టే. కాకపోతే నార్త్ లో జెండా నాటడం అంత సులభం కాదు. పూజా హెగ్డే శతవిధాలా ప్రయత్నించి అక్కడ చెప్పుకోదగ్గ చిత్రాలే చేసింది కానీ ఒక్కటీ ఆడలేదు. కిసీకా భాయ్ కిసీకా జాన్ మరీ దారుణం. ఏకంగా ట్రోలింగ్ బారిన పడింది. మరి రష్మికకు అలాంటి పరిస్థితి రాకూడదంటే యానిమల్ రేంజ్ లో బ్లాక్ బస్టర్లు కొనసాగాలి. పుష్ప 2, సికందర్, ది గర్ల్ ఫ్రెండ్, కుబేర అన్నీ హిందీలోనూ డబ్ కాబోతున్నాయి. విజయ్ దేవరకొండ 14లోనూ ఉండొచ్చని వినికిడి.
This post was last modified on May 9, 2024 11:01 am
మాళవిక మోహనన్.. చాలా ఏళ్ల నుంచి సోషల్ మీడియాలో ఈ పేరు ఒక సెన్సేషన్. బాలీవుడ్లో దిశా పటాని తరహాలో…
ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రానికి సంబంధించి సరికొత్త ప్రాజెక్టును ప్రకటించారు. దీనికి 'తెలుగు తల్లికి జల హారతి' అనే పేరును…
పుష్ప-2 సినిమా ప్రిమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన, అనంతర పరిణామాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
కొద్దిరోజుల క్రితం బేబీ జాన్ ప్రమోషన్లలో నిర్మాత అట్లీ మాట్లాడుతూ రన్బీర్ కపూర్ కి యానిమల్ ఎలా అయితే సూపర్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారిక పర్యటనలు, కార్యక్రమాల సందర్భంగా ఆయన అభిమానులు సినిమాల గురించి నినాదాలు చేయడం…
జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలయికలో తెరకెక్కుతున్న వార్ 2 షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తోంది. వచ్చే ఏడాది ఆగస్ట్…