ఈసారి ‘బిగ్ బాస్’ కొత్త సీజన్ ఆరంభానికి ముందు షో మీద జనాల్లో అంత ఆసక్తి కనిపించలేదు. ఈసారి హోస్ట్ మారకపోవడం, మళ్లీ నాగార్జునే ఆ బాధ్యత తీసుకోవడం.. కంటెస్టంట్ల జాబితా ఏమంత ఎగ్జైటింగ్‌గా లేకపోవడమే అందుక్కారణం.
ఐతే కరోనా వల్ల జనాలు ఒకప్పటి స్థాయిలో బయట తిరక్కపోవడం, థియేటర్లలో సినిమాలు చూసే అవకాశం లేకపోవడంతో టీవీల్లో వివిధ కార్యక్రమాలకు, సినిమాలకు రికార్డు స్థాయిలో రేటింగ్ వస్తున్న నేపథ్యంలో ‘బిగ్ బాస్’కు కూడా రేటింగ్స్ ఎక్కువే వస్తాయని అంచనా వేశారు. ఇప్పుడు అదే నిజమైంది. ‘బిగ్ బాస్’ నాలుగో సీజన్ ఆరంభ ఎపిసోడ్ రికార్డు స్థాయి రేటింగ్ నమోదు చేసింది. సెప్టెంబరు 6న ఆదివారం ప్రసారం అయిన ‘బిగ్ బాస్-4’ లాంచింగ్ ఎపిసోడ్‌కు 18.5 టీఆర్పీ వచ్చింది. తెలుగు ‘బిగ్ బాస్’ చరిత్రలో ఒక ఎపిసోడ్‌కు వచ్చిన అత్యధిక రేటింగ్ ఇదే కావడం విశేషం.
గత ఏడాది నాగార్జునే హోస్ట్ చేసిన మూడో సీజన్ తొలి ఎపిసోడ్‌కు 17.9 రేటింగ్ వచ్చింది. అప్పుడు అది రికార్డు. దాన్ని తాజా ఎపిసోడ్ బీట్ చేసింది. షో ఆరంభానికి ముందు అంచనాలు తక్కువ ఉన్నప్పటికీ.. ఆరంభ ఎపిసోడ్‌ను జనాల అంచనాలకు మించి ఎంటర్టైనింగ్‌గా మలిచారు రూపకర్తలు. కంటెస్టెంట్ల ఎంట్రీ ప్లాన్ చేసిన విధానం, వాళ్ల నేపథ్యానికి సంబంధించిన వీడియోలు ఆకట్టుకున్నాయి. అలాగే ఇద్దరు కంటెస్టంట్లను సీక్రెట్ రూంకు పంపించడం ద్వారా తొలి రోజే షోను రక్తి కట్టించారు.
ఆ ఎపిసోడ్ ఆద్యంతం ఆకట్టుకుందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అందుకు తగ్గట్లే మంచి రేటింగ్ వచ్చింది. ఇక తొలి వారం జనాలకు రాంగ్ సిగ్నల్స్ ఇచ్చిన దర్శకుడు సూర్యకిరణ్ ఎలిమినేషన్ వేటుకు గురయ్యాడు. ఐతే వెళ్తూ వెళ్తూ తన సహచరుల గురించి చక్కగా విశ్లేషించడం ద్వారా తన ప్రత్యేకతను చాటుకున్న సూర్యకిరణ్ అతడిని పంపించేసి తప్పు చేశామనే అభిప్రాయాన్ని వీక్షకుల్లో కలిగించాడు.
This post was last modified on September 17, 2020 12:50 pm
ఏపీ రాజధాని అమరావతికి సంబంధించిన కీలక నిర్ణయం తెరమీదికి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ఓ ప్రకటన చేసింది.…
వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి రిమాండ్ పొడిగిస్తూ.. విజయవాడ కోర్టు తీర్పు చెప్పింది. ఇప్పటికే ఆయన…
ఐపీఎల్లో రికార్డు స్థాయిలో ఐదు ట్రోఫీలు గెలిచిన జట్టు ముంబయి ఇండియన్స్. కానీ ఈ సీజన్లో పేలవ ప్రదర్శన చేస్తోంది.…
డైలాగ్ కింగ్ మంచు మోహన్‌బాబు ఇంట్లో ఇటీవల కాలంలో పలు రగడలు తెరమీదికి వస్తున్న విషయం తెలిసిందే. ఆస్తుల వివాదాలు…
మొదటిసారి విడుదలైనప్పుడు ఫ్లాప్ అనిపించుకుని ఏళ్ళు గడిచేకొద్దీ కల్ట్ ముద్రతో రీ రిలీజులు సూపర్ హిట్ కావడం ఈ మధ్య…
కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ (ఏఐసీసీ) సమావేశాలు గుజరాత్ లోని అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న సంగతి…