సోషల్ మీడియా, టీవీ ఛానల్స్ పెరిగిపోయాక అనుకరణలు, ట్రోలింగ్ లు విపరీతంగా పెరిగిపోయాయి. త్వరగా వచ్చే పాపులారిటీ కావడంతో ఎలాంటి పనికైనా సిద్ధపడటం ఈ మధ్య కనిపిస్తోంది. ఇటీవలే ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో టాలీవుడ్ సీనియర్ రచయిత ఒకరు దివంగత నటులు, హీరోయిన్లు మీద చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ఆయన కామెంట్ల పట్ల అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యింది. చివరికాయన బహిరంగ క్షమాపణ చెప్పక తప్పలేదు. ఇలాంటి ఉదంతమే మరొకటి బాలీవుడ్ లోనూ జరిగింది. దాని బారిన పడింది కరణ్ జోహార్.
తాజాగా ఓ శాటిలైట్ ఛానల్ కు సంబంధించిన కామెడీ షోలో హాస్య నటుడు కేతన్ సింగ్ అచ్చం కరణ్ జోహార్ ని మిమిక్రీ చేస్తూ ఆయన హావభావాలను చూపించే ప్రయత్నంలో కొంత ఓవరాక్షన్ చేశాడు. ఈ ప్రోమో కాస్తా వైరలయ్యింది. దీంతో స్వయంగా కరణ్ స్పందిస్తూ ముక్కు మొహం తెలియని యూట్యూబర్లు మీమర్లు చేస్తే ఏదో అనుకోవచ్చు కానీ ఇలా పరిశ్రమలోనే ఉండే వ్యక్తులు, మీడియా సంస్థలు ఇలాంటి వాటిని ప్రోత్సహించడం దారుణమని పేర్కొన్నాడు. తన తల్లితో కలిసి చూస్తుండగా టీవీలో యాడ్ వచ్చిందని, తనకేం చెప్పాలో అర్థం కాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
పాతిక సంవత్సరాల సీనియర్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ అయిన తనకే ఇలా జరిగితే ఇక సామాన్యుల మాటేమిటని ప్రశ్నించారు. దీంతో వ్యవహారం ముదిరింది గుర్తించిన కేతన్ సింగ్ వెంటనే క్షమాపణ చెప్పేశారు. కరణ్ జోహార్ అంటే తనకు ఎంతో గౌరవం ఉందని, అవమానించాలని చేయలేదని, జరిగినదానికి మనస్ఫూర్తిగా సారీ చెబుతున్నానని వివాదాన్ని చల్లార్చే ప్రయత్నం చేశాడు. మొత్తానికి సిగరెట్ కు నిప్పు వెలిగించబోతే కొంప అంటుకున్నట్టు అయ్యింది. ఆ మధ్య తెలుగులోనూ ఒక స్టార్ హీరో విషయంలో ఇలాగే జరిగితే సదరు హాస్య నటుడికి ఫ్యాన్స్ రోడ్డు మీదే దేహశుద్ధి చేయడం తెలిసిందే.
This post was last modified on May 7, 2024 10:20 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…