కెరీర్ మొదలుపెట్టి సంవత్సరాలు గడుతున్నా ఒక పెద్ద బ్రేక్ దక్కించుకుని టాప్ లీగ్ లోకి వెళ్లిపోవాలనే ప్లాన్ లో ఉన్న హీరోయిన్ జాన్వీ కపూర్ కి ఈసారి అన్ని కలిసి వచ్చేలా ఉన్నాయి. నిజానికి హిందీలో తనకు స్టార్ల సరసన అవకాశాలు అట్టే దక్కడం లేదు. పైగా రెగ్యులర్ గా డ్యూయెట్లు పాడే ధోరణికి దూరంగా ఉండాలని ఆమె నిర్ణయించుకోవడంతో ఎక్కువ పెర్ఫార్మన్స్ డిమాండ్ చేసే పాత్రలనే ఎంచుకుంటోంది. తెలుగులో ఒకేసారి ఆర్ఆర్ఆర్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ల సరసన రెండు వేర్వేరు సినిమాలు చేసే ఛాన్స్ కొట్టేసి డబుల్ జాక్ పాటు కొట్టేసింది.
హిందీలో మాత్రం జాన్వీ కపూర్ కంటెంట్ ఉన్న లైనప్ నే ఎంచుకోవడం గమనార్హం. రాజ్ కుమార్ రావు సరసన చేసిన మిస్టర్ అండ్ మిసెస్ మహీ ఈ నెలాఖరున విడుదల కానుంది. వరుణ్ ధావన్ జంటగా సన్నీ సంస్కారికి తులసి కుమారి ఈ వేసవిలోనే షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు. గుల్షన్ దేవయ్యతో నటించిన ఉల్జా జూలై అయిదున థియేటర్లలో అడుగు పెడుతుంది. ఇక తారక్ దేవర పార్ట్ 1 అక్టోబర్ పదిన రిలీజయ్యాక రెండో భాగం ఎప్పటి నుంచి ఉంటుందనే దాన్ని బట్టి కాల్ షీట్లు కేటాయించాల్సి ఉంటుంది. ఆర్సి 16 జూలై లేదా ఆగస్ట్ నుంచి సెట్స్ పైకి వెళ్ళిపోతుంది.
గ్లామర్ రోల్స్ కి దూరంగా ఇలా ఇన్ని మంచి అవకాశాలు దక్కడం అరుదే. దేవర, ఆర్సి 16 రెండూ నటనకు స్కోప్ ఉన్న పాత్రలే. పల్లెటూరి తరహా నేపధ్యాలతోనే సాగుతాయి. అందుకే హీరోల ఇమేజ్ తో పాటు కథలో ఉన్న దమ్ము తనకు కెరీర్ పరంగా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇవి కనక హిట్ అయితే శ్రీలీల ఇచ్చిన గ్యాప్ తో పాటు రష్మిక మందన్న లాంటి వాళ్ళు ఎక్కువ తెలుగు సినిమాలు చేయలేకపోతున్న అవకాశాన్ని జాన్వీ కపూర్ వాడుకోవచ్చు. ఇవి కాకుండా మరో రెండు టాలీవుడ్ ప్రొడక్షన్ హౌసెస్ నుంచి ఆఫర్లు ఉన్నాయట కానీ ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం.
This post was last modified on May 7, 2024 11:14 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…