ఎడిటర్ మోహన్ నిర్మాణ సంస్థ ఎంఎస్ ఆర్ట్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా సుకుమార్ పని చేస్తున్న రోజులవి. ముప్పై వేల జీతమిచ్చే మ్యాథ్స్ టీచర్ ఉద్యోగాన్ని వదిలేసి హైదరాబాద్ లో చాలీచాలని జీతంతో కేవలం కసితో బ్రతుకుతున్న టైంలో దిల్ కోసం పని చేయాలని వినాయక్ టీమ్ నుంచి పిలుపు వస్తే అక్కడికి వెళ్ళాడు.
ఓ మంచి సందర్భం చూసి నిర్మాత రాజుగారికి తనదగ్గరున్న వన్ సైడ్ లవ్ స్టోరీ చెప్పేశాడు. మొదట్లో సంశయించినా అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాత మరోమాట లేకుండా ఇది చేయాలని ఫిక్స్ అయిపోయారు. ఈలోగా దిల్ సూపర్ హిట్ కావడంతో రాజుగారికి బోలెడు నమ్మకం వచ్చేసింది.
కథ రవితేజ, ప్రభాస్ లాంటి కొందరు స్టార్ హీరోలకు దగ్గరికి వెళ్ళింది కానీ పనవ్వలేదు. ఓ పార్టీలో అల్లు అర్జున్ ని చూసిన సుకుమార్ తనకు కావాల్సిన కుర్రాడు ఇతనే కదాని అనిపించి వెంటనే దిల్ రాజుని అడిగేశాడు. గంగోత్రి తర్వాత తొంభై నెరేషన్లు విన్న బన్నీకి ఆర్య పిచ్చిపిచ్చిగా నచ్చేసింది.
పూర్తి మేకోవర్ కు సిద్ధపడ్డాడు. కొన్ని మార్పులతో అల్లు అరవింద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చిరంజీవికి సైతం నచ్చేసింది. బడ్జెట్ విషయంలో రాజీపడకుండా దేవిశ్రీ ప్రసాద్, రత్నవేలు లాంటి టాప్ టెక్నికల్ టీమ్ ని సెట్ చేసుకున్నారు. యాడ్స్ మోడల్ అను మెహతా హీరోయిన్ గా ఎంపికయ్యింది.
2003లో షూటింగ్ మొదలయ్యింది. రెండున్నర నెలలు ప్లాన్ చేసుకుంటే నాలుగు నెలలు పట్టింది. ఆడియో చార్ట్ బస్టర్ అయిపోయింది. 2004 మే 5 ఆర్య థియేటర్లలో అడుగుపెట్టాడు. టాక్ స్లోగా పాకడం మొదలైంది. మరుసటి రోజు నుంచి టికెట్లు దొరకలేదు.
గంగోత్రిలో చేసిన కుర్రాడే ఆర్యలో అద్భుతంగా నటించాడంటే ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్ ఊరువాడా హోరెత్తిపోయాయి. 125 రోజుల వేడుక ఘనంగా నిర్వహించారు. అల్లు అర్జున్, సుకుమార్ అభినందనల వర్షంలో తడిసిపోయారు. ఇప్పటికీ రెండు దశాబ్దాల తర్వాత పుష్పతో అది కొనసాగుతూనే ఉంది.
This post was last modified on May 6, 2024 4:00 pm
కొందరు దర్శకులు టెక్నీషియన్ల విషయంలో చాలా పర్టికులర్‌గా ఉంటారు. తమతో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్ పుట్ ఇచ్చే…
నివిన్ పౌలీ.. 11 ఏళ్ల ముందు ప్రేమమ్ మూవీతో పెద్ద హిట్టు కొట్టి స్టార్ ఇమేజ్ సంపాదించిన నటుడు. ఆ…
అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…
తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…
హీరో హీరోయిన్లకు.. పెద్ద టెక్నీషియన్లకు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోషకాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్టర్లు చేసేవాళ్లకు…
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…