సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ తీసే సినిమాలో.. ఓ పెద్ద హీరో నటించినపుడు చిన్న సన్నివేశమైనా సరే సుక్కునే తీయాల్సి ఉంటుంది. కానీ తాను తీసిన రెండు చిత్రాల్లో కీలకమైన సన్నివేశాలను తన అసిస్టెంట్ డైరెక్ట్ చేసినట్లుగా సుకుమార్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం. ఆ చిత్రాలు జూనియర్ ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో, అల్లు అర్జున్ హీరోగా చేసిన ఆర్య-2 అట. ఈ రెండు చిత్రాల్లో రెండు సన్నివేశాలను అప్పటి తన అసిస్టెంట్ అర్జున్ వైకే డైరెక్ట్ చేసినట్లు సుకుమార్ వెల్లడించాడు.
అర్జున్ ఇటీవలే విడుదలైన ప్రసన్న వదనంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా విమర్శల ప్రశంసలందుకుంది. బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపిస్తోంది. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లోనే అర్జున్ మీద ప్రశంసల జల్లు కురిపించాడు సుక్కు. తన సినిమాల్లో లాజిక్‌లు బాగా కనెక్ట్ కావడానికి అర్జునే కారణమని.. అతను దూరమయ్యాక లాజిక్ ఉన్న సినిమాలు తీయడం మానేశానని సుక్కు అన్న సంగతి తెలిసిందే.
తాజాగా ప్రసన్న వదనం ప్రమోషనల్ ఇంటర్వ్యూలో భాగంగా అర్జున్ మీద మరోసారి తన ప్రేమను చాటుకున్నాడు సుక్కు. నాన్నకు ప్రేమతో సినిమా టైంలో అర్జున్ మీద ఎన్టీఆర్‌కు బాగా కుదిరిందని.. దీంతో ఒక కీలకమైన ఎపిసోడ్‌ను తన దర్శకత్వంలోనే చేశాడని సుకుమార్ వెల్లడించాడు.
తన అసిస్టెంట్‌ను తాను నమ్మి ఆ బాధ్యత ఇవ్వడం గొప్ప కాదని.. ఎన్టీఆర్ నమ్మి ఆ సీన్ చేయడం అర్జున్ మీద ఎన్టీఆర్ నమ్మకానికి నిదర్శనమని చెప్పాడు సుక్కు. అలాగే ఆర్య-2లో కూడా ఒక సన్నివేశాన్ని అర్జున్ డైరెక్ట్ చేసినట్లు సుకుమార్ తెలిపాడు. ఇక ప్రసన్న వదనం హీరో సుహాస్ మీదా సుకుమార్ ప్రశంసలు కురిపించాడు. అతడి నటన ప్రత్యేకంగా ఉంటుందని.. స్క్రిప్ట్ సెలక్షన్ చాలా బాగుంటుందని సుకుమార్ కితాబిచ్చాడు.
This post was last modified on May 6, 2024 7:13 am
విశ్వక్ సేన్ కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్ లైలా. ఆడవేషం వేసి నరేష్ పాత సినిమా చిత్రం భళారే విచిత్రంలాగా…
#AskKavitha- హ్యాష్ ట్యాగ్‌తో నెటిజన్ల నుంచి అభిప్రాయాలు సేకరించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత.. ఇదే సమయంలో పలువురు నెటిజన్లు…
భారతదేశం గర్వించదగ్గ గొప్ప సంగీత విద్వాంసుల్లో ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి స్థానం ఎవరూ భర్తీ చేయనిది, అందుకోలేనిది. దక్షిణాదిలోనే కాదు…
మాటిచ్చిన కేవలం పదిరోజుల్లోనే ఆ హామీని కార్యరూపంలోకి తీసుకువచ్చారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. తొమ్మిది రోజుల క్రితం చిలకలూరిపేట…
నటుడిగా చాలా గ్యాప్ తీసుకున్న మంచు మనోజ్ ఈ ఏడాది రెండు సినిమాల్లో విలన్ గా నటించి కంబ్యాక్ అయ్యాడు.…
హర్యానాలో పనిచేస్తున్న తెలుగు ఐపీఎస్ అధికారి వై. పూరన్ కుమార్ ఆత్మహత్య ఘటనలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ…