Movie News

శ్యామ్ సింగ రాయ్ దర్శకుడి కొత్త ట్యాక్సీ

కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు ఖర్చు పెడతారు. రాహుల్ సంకృత్యాన్ ఈ బాపతే. న్యాచురల్ స్టార్ నానితో 2021 శ్యామ్ సింగ రాయ్ చేశాక మళ్ళీ ఇంకో మూవీ మొదలుపెట్టలేదు. అది మంచి విజయంతో పాటు అవార్డులు తీసుకొచ్చినా సరే తొందరపడకుండా ఆచితూచి అడుగులు వేస్తూ వచ్చాడు. మధ్యలో ఒక పెద్ద స్టార్ హీరో కోసం ప్రయత్నించాడనే టాక్ వచ్చింది కానీ తర్వాత దాని గురించి ఎలాంటి ఊసు లేకుండా పోయింది. ఫైనల్ గా తన కాంబోని సెట్ చేసుకున్నట్టు లేటెస్ట్ అప్డేట్.

విజయ్ దేవరకొండతో ఒక ప్యాన్ ఇండియా మూవీకి రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. గతంలో వీళ్లిద్దరి కలయిక టాక్సీవాలా వచ్చింది. రిలీజ్ కు ముందే ఆన్ లైన్ లో పైరసీ వెర్షన్ లీకైనప్పటికీ మంచి విజయం సాధించింది. కమర్షియల్ గా గీత గోవిందం స్థాయి కాకపోయినా దీనికైన బడ్జెట్ కు తగ్గట్టుగా లాభాలు తీసుకొచ్చింది. ఇప్పుడు పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ తో రాహుల్ చెప్పిన స్టోరీ నచ్చడంతో రౌడీ బాయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఫైనల్ స్క్రిప్ట్ లాక్ అయిపోవడంతో మైత్రి నిర్మాణంలో తీసేందుకు ప్లాన్ చేస్తున్నారట. డియర్ కామ్రేడ్, ఖుషి తర్వాత మూడోసారి చేతులు కలుపుతున్నారు.

ప్రస్తుతం రౌడీ హీరో గౌతమ్ తిన్ననూరి సినిమాలో బిజీగా ఉన్నాడు. ఒక ఆరు నెలలు దీని మీద సీరియస్ గా వర్క్ జరుగుతుంది. రాజావారు రాణిగారు ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వం వహించే మరో సినిమా వచ్చే వారం లాంఛనంగా ప్రకటించబోతున్నారు. రౌడీ జనార్దన్ టైటిల్ పరిశీలనలో ఉంది. ఇవి అయ్యాకే రాహుల్ సంకృత్యాన్ మూవీ పట్టాలు ఎక్కొచ్చు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ది ఫ్యామిలీ స్టార్ తీవ్రంగా నిరాశ పరచడంతో విజయ్ దేవరకొండ కొత్త స్క్రిప్ట్ ల మీద మరింత శ్రద్ధ పెడుతున్నాడు. మార్కెట్ మళ్ళీ బలపడాలంటే సాలిడ్ బ్లాక్ బస్టర్ అవసరం. అది ఎవరు ఇస్తారో చూడాలి. 

This post was last modified on May 2, 2024 6:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

1 hour ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

6 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

6 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

8 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

8 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

9 hours ago