వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో రేపు రిలీజవుతున్న వాటిలో ఫ్యామిలీ యాంగిల్ లో కనిపిస్తున్నది ఆ ఒక్కటి అడక్కు మాత్రమే. అల్లరి నరేష్ సీరియస్ జానర్ నుంచి బయటికి వచ్చి మళ్ళీ ఫుల్ లెన్త్ కామెడీతో వస్తున్నాడు. ఇప్పటిదాకా పని చేసిన 32 మందిలో దీని దర్శకుడు మల్లి మాత్రమే టెన్షన్ లేకుండా కూల్ గా కనిపించాడని అంత నమ్మకం ఉందని బలంగా చెప్పుకొచ్చాడు. ఇది ఎందుకు పరీక్షగా మారుతోందో ఓసారి చూద్దాం.
తిరిగి ఎంటర్ టైన్మెంట్ రూట్ పట్టాక అల్లరి నరేష్ సీరియస్ గా హాస్య కథల వైపు దృష్టి పెడుతున్నాడు. అందులో భాగంగానే సుడిగాడు 2ని ప్యాన్ ఇండియా లెవెల్ లో ప్లాన్ చేస్తుండగా, బచ్చల మల్లిలో నవ్వులకు పెద్ద పీఠ వేయిస్తున్నాడు. తండ్రి ఈవీవీ తీసిన క్లాసిక్స్ అప్పుల అప్పారావు, జంబలకిడిపంబ లాంటి వాటిని రీమేక్ చేయడమో లేదా కొనసాగింపు తీయించే ఆలోచనలు గట్టిగా చేస్తున్నాడు. ఇవన్నీ ముందడుగు వేయాలంటే ఇప్పుడీ ఆ ఒక్కటి అడక్కు హిట్టు కొట్టడం చాలా అవసరం, నాంది మినహాయించి సోలో హీరోగా తనకు సక్సెస్ దక్కి చాలా గ్యాప్ వచ్చేసింది.
అదీ కాకుండా జబర్దస్త్ జోకులకు అలవాటు పడిపోయి థియేటర్ కామెడీ ఛాలెంజ్ గా మారిన తరుణంలో అల్లరి నరేష్ కెరీర్ కు ఆ ఒక్కటి అడక్కు బూస్ట్ ఇవ్వడం చాలా అవసరం. వెంకటేష్ మల్లేశ్వరి తరహా పాయింట్ తీసుకున్నప్పటికీ ఇందులో సర్ప్రైజ్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయట. అల్లరోడి కబుర్లు కాసేపు పక్కనపెడితే ఇది విజయవంతం కావడం వల్ల మళ్ళీ థియేటర్లలో జనాలు కనపడతారు. అడ్వాన్స్ బుకింగ్స్ ఏమంత జోరుగా లేకపోయినా టాక్ వస్తే చాలు సామజవరగమనలాగా ఒకటి రెండు ఆటల్లోపే అమాంతం పికప్ చూపించే స్టామినా ఇలాంటి సినిమాలకు ఉంటుంది.
This post was last modified on May 2, 2024 6:01 pm
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…