తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ బయోపిక్ కి రంగం సిద్ధమవుతోంది. బాలీవుడ్ ప్రొడ్యూసర్ సాజిద్ నడియాడ్ వాలా భారీ బడ్జెట్ తో నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఈ ఇద్దరు చెన్నైలో కలుసుకోవడంతో ఈ వార్తకి మరింత బలం చేకూరింది. మాములుగా మనమధ్య లేని లెజెండ్స్ కథలని తెరమీద చూపించడం ఇప్పటిదాకా జరిగింది, మహానటి, ఎన్టీఆర్ కథానాయకుడు – మహానాయకుడు, తలైవి ఆ కోవలో వచ్చినవే. సంజు ఒకటి మినహాయింపు. ఇళయరాజాది మాత్రం ఆయన ఉండగానే ధనుష్ హీరోగా ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. రచనలో కమల్ హాసన్ పాలు పంచుకుంటున్నారు.
క్రీడలకు సంబంధించి లివింగ్ లెజెండ్స్ మీదే ఎక్కువ వచ్చాయి. సచిన్, ధోని, అజహర్, మేరీ కోమ్, మిథాలీ రాజ్ ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టు ఉంది. ఇక రజనీకాంత్ జీవితాన్ని స్క్రీన్ మీద చూపించడం మంచి ఆలోచనే కానీ ఆ పాత్ర ఎవరు చేస్తారనేది పెద్ద ప్రశ్న. ధనుష్ ఆల్రెడీ ఇళయరాజా చేస్తున్నాడు కాబట్టి ఒకే సమయంలో రెండు సాధ్యం కాదు. నెక్స్ట్ ఆప్షన్స్ గా కోలీవుడ్ లో చాలా హీరోలు ఉన్నారు కానీ రజనిని గ్రేస్ ని మ్యాచ్ చేయడం అంత సులభం కాదు. పెద్ద రిస్కు. సో ఏ మాత్రం తేడా వచ్చినా అభిమానులు, యాంటీ ఫ్యాన్స్ ట్రోలింగ్ మాములుగా ఉండదు.
రజనీకాంత్ జీవితంలో డ్రామా అయితే చాలానే ఉంది. బస్ కండక్టర్ గా కెరీర్ మొదలుపెట్టడం, ప్రాణ స్నేహితుడి సలహా విని ఉద్యోగం వదిలేసి చెన్నై రావడం, అవకాశాల కోసం ప్రయత్నాలు, బాలచందర్ దగ్గర శిష్యరికం, కమల్ హాసన్ స్నేహం, లతతో ప్రేమ వివాహం, బాలీవుడ్ ఛాన్సులు ఇలా చాలా పాయింట్స్ ఉన్నాయి. కాకపోతే వీటిని సమర్ధవంతంగా హ్యాండిల్ చేయగలిగిన దర్శకుడు కావాలి. అతను ఎవరై ఉంటారనేది మాత్రం ప్రస్తుతానికి సీక్రెట్ గా ఉంచుతున్నారు. స్టైల్ ఐకాన్ రజని లైఫ్ ని తెరమీద చూసే అవకాశం దక్కడం కన్నా మూవీ లవర్స్ కి కనులపండగ ఏముంటుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates