Movie News

విజయ్ దేవరకొండ.. సీమ డైలాగ్స్

వరుసగా ఫెయిల్యూర్లు ఎదురవుతున్నప్పటికీ టాలీవుడ్లో విజయ్ దేవరకొండ జోరైతే ఏమీ తగ్గట్లేదు. అతడితో సినిమా చేయడానికి దర్శకులు, నిర్మాతలు బాగానే ఆసక్తి చూపిస్తున్నారు. ‘ఫ్యామిలీ స్టార్’ పెద్ద డిజాస్టర్ అయినప్పటికీ మూడు సినిమాలు లైన్లో పెట్టాడు విజయ్. అందులో గౌతమ్ తిన్ననూరి చిత్రం ఎప్పుడో అనౌన్స్ చేసింది. త్వరలోనే దాని షూటింగ్‌కు హాజరు కాబోతున్నాడు.

మరోవైపు ‘రాజావారు రాణివారు’ ఫేమ్ రవికిరణ్ దర్శకత్వంలో దిల్ రాజు ప్రొడ్యూస్ చేసే సినిమా కూడా లైన్లో ఉంది. ఆ చిత్రానికి ‘రౌడీ జనార్దన్’ అనే టైటిల్ కూడా అనుకుంటున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఇప్పుడు విజయ్ మరో చిత్రానికి పచ్చజెండా ఊపాడు. అది ‘ట్యాక్సీవాలా’ తర్వాత రాహుల్ సంకృత్యన్ విజయ్‌తో తీయబోయే సినిమా.

‘ట్యాక్సీవాలా’తో ఘనవిజయాన్నందుకున్న రాహుల్.. ఆ తర్వాత నానితో చేసిన ‘శ్యామ్ సింగరాయ్’ కూడా బాగా ఆడింది. తొలి సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న రాహుల్.. మూడో చిత్రం విషయంలోనూ అదే చేస్తున్నాడు. ‘శ్యామ్ సింగరాయ్’ విడుదలైన రెండేళ్ల తర్వాతే తన తర్వాతి సినిమాను మొదలుపెడుతున్నాడు. విశేషం ఏంటంటే.. ఈసారి అతను రాయలసీమ నేపథ్యంలో ఒక పీరియడ్ డ్రామా తీయబోతున్నాడట.

పక్కా తెలంగాణ హీరోగా గుర్తింపు పొందిన విజయ్.. ఇప్పటిదాకా ఆంధ్ర, సీమ యాసల్లో డైలాగులు చెప్పింది లేదు. అతను రాయలసీమ భాష, యాసలో మాట్లాడితే ఎలా ఉంటుందన్నది ఆసక్తికరం. విజయ్‌కి అది సూటవుతుందా అన్న సందేహాలున్నాయి కానీ.. మంచి పెర్ఫామర్ అయిన విజయ్ ఆ పనిని పర్ఫెక్ట్‌గానే చేస్తాడని ఆశించవచ్చు. త్వరలోనే ఈ సినిమా గురించి అనౌన్స్‌మెంట్ రాబోతోందట.

This post was last modified on May 1, 2024 2:25 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎల్ ఫ్యాన్స్ కోసం తెలంగాణ RTC గుడ్ న్యూస్

హైదరాబాద్ క్రికెట్ అభిమానుల కోసం తెలంగాణ ఆర్టీసీ ఓ మంచి వార్త అందించింది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో…

2 minutes ago

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై కేంద్రం క్లారిటీ.. రాష్ట్రాలకే అధికారం!

ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్స్ భూతంగా మారుతున్న ఈ రోజుల్లో, కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన చేసింది. ఆన్‌లైన్…

27 minutes ago

మంత్రివ‌ర్గంలో మాకు చోటేదీ: కాంగ్రెస్‌లో కొత్త‌ చిచ్చు

తెలంగాణలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో కొత్త చిచ్చు తెర‌మీదికి వ‌చ్చింది. త్వ‌ర‌లోనే మంత్రి వ‌ర్గాన్ని విస్తరించాల‌ని పార్టీ అధిష్టానం నిర్ణ‌యించిన విష‌యం…

1 hour ago

బెట్టింగ్ యాప్స్‌పై రేవంత్ సీరియస్ విచారణకు సిట్ సిద్ధం!

తెలంగాణలో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ కలకలం కొనసాగుతూనే ఉంది. యువతను ఫైనాన్స్ దోపిడీ దిశగా నెట్టేసిన ఈ యాప్స్ కారణంగా…

1 hour ago

తెలంగాణ అసెంబ్లీలో ‘క‌మీష‌న్ కే’ దుమారం.. ఏం జ‌రిగింది?

తెలంగాణ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల్లో అధికార, విప‌క్షాల మ‌ధ్య మాటల యుద్ధం సాగుతున్న విష‌యం తెలిసిందే. అనేక అంశాల‌పై ఇరు…

2 hours ago

భద్రాచలంలో కూలిన భవన నిర్మాణం… ఆరుగురు మృతి

తెలంగాణలో శ్రీ సీతారామ స్వామి కొలువై ఉన్న భద్రాచలంలో బుధవారం ఘోర ప్రమాదం సంభవించింది. నిర్మాణంలో ఉన్న ఆరంతస్తుల భవనం…

3 hours ago