పుష్ప 2 ది రూల్ విడుదల ఇంకో నాలుగు నెలల్లోనే ఉన్నా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమా ఎవరితో అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. దర్శకుడు అట్లీ కథను సిద్ధం చేస్తున్నాడనే లీక్స్ బలంగా ఇచ్చినా ఇప్పటిదాకా అనౌన్స్ మెంట్ రాలేదు. కథ విషయంలో ఇంకా ఏకాభిప్రాయం రాకపోవడం వల్లే ఆలస్యమవుతోందనే వార్త గట్టిగా తిరిగుతోంది. బన్నీ పుట్టినరోజు నాడు దీనికి సంబంధించి సోషల్ మీడియాలో కొంత హడావిడి చేశారు కానీ తర్వాత ఎలాంటి సౌండ్ లేదు. ఇంకోవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్ నాలుగోసారి అల్లు అర్జున్ తో చేయబోతున్న మూవీ కోసం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారట.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇందులో బన్నీ కెరీర్ లోనే మొదటిసారి డబుల్ యాక్షన్ చేయబోతున్నారని తెలిసింది. తన రెగ్యులర్ ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్ ని పక్కనపెట్టి ఈసారి త్రివిక్రమ్ ఫాంటసీ టచ్ ఉన్న భారీ సబ్జెక్టుని రెడీ చేసినట్టు సమాచారం. ద్విపాత్రలు రెండూ దేనికవే సంబంధం లేకుండా షాకింగ్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయని అంటున్నారు. ఇంత లీక్ రావడమే గొప్ప కాబట్టి ఎక్కువ వివరాలు ప్రస్తుతానికి ఆశించలేం. గుంటూరు కారం రిలీజ్ నుంచి అసలు కనిపించడమే మానేసిన మాటల మాంత్రికుడు పూర్తిగా దీని మీదే ఫోకస్ పెట్టి బిజీగా ఉన్నారట.
ఈ లెక్కన జూలైలో దీనికి సంబంధించిన ప్రకటన ఏమైనా వచ్చే అవకాశముంది. బన్నీ దగ్గర మూడు ఆప్షన్లు సిద్ధంగా ఉన్నాయి. అట్లీ కనక స్టోరీ వేగంగా తీసుకొస్తే వెంటనే సెట్స్ పైకి వెళ్లొచ్చు. లేదూ కొంత కాలం ఆగాల్సి వస్తే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ ఛాన్స్ వాడుకోవచ్చు. కానీ అప్పటికంతా ఫైనల్ వెర్షన్ అవుతుందా అంటే చెప్పలేం. నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగా సెట్లో అడుగు పెట్టాలంటే ముందు అతను స్పిరిట్, యానిమల్ పార్క్ పూర్తి చేసుకుని రావాలి. ఈ లెక్కన చూస్తే మొదటి ఇద్దరికే ఛాన్స్ ఎక్కువగా ఉంది. సెట్ మీదే ఒకే సినిమా పెట్టిన ప్యాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ ఒక్కడే అంటే ఆశ్చర్యమే.
This post was last modified on April 30, 2024 7:19 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…