Movie News

టిల్లు లిల్లీకి అవకాశాల వెల్లువ

మొన్నటిదాకా తెలుగు సినిమాల్లో కనిపించడమే తగ్గించేసిన అనుపమ పరమేశ్వరన్ కు టిల్లు స్క్వేర్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ఎక్కడ లేని ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. బోల్డ్ సీన్స్ విషయంలో అభిమానులు తొలుత సంశయం వ్యక్తం చేసినా తర్వాత తను తీసుకున్నది ఎంత సరైన నిర్ణయమో ఫలితం ఋజువు చేసింది. నటనకు లోటు లేకపోయినప్పటికీ గ్లామర్ షోకు నో చెబుతూ వచ్చిన అనుపమ ఇప్పుడు టిల్లు తరహాలో డిఫరెంట్ షేడ్స్ ఉంటే ఎస్ చెప్పేస్తోంది కాబట్టి దర్శక నిర్మాతలు తనను కలుస్తున్నారు. ప్రశాంత్ వర్మ ఆక్టోపస్ లో తనదే ముఖ్య పాత్రనే సంగతి తెలిసిందే. ఇంకా అనౌన్స్ మెంట్ రాలేదు.

సినిమా బండితో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ప్రవీణ్ దర్శకత్వంలో రూపొందుతున్న పరదాలో అనుపమదే లీడ్ రోల్. ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆసక్తి రేపింది. తాజాగా బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సరసన కొత్త ప్రాజెక్టు ఓకే అయ్యిందని సమాచారం. కార్తికేయ చావు కబురు చల్లగాతో డెబ్యూ చేసిన కౌశిక పెగళ్ళపాటి తీస్తున్న ఫాంటసీ థ్రిల్లర్ లో అనుపమ పరమేశ్వరన్ నే తీసుకున్నట్టు తెలిసింది. కిష్కిందపురి టైటిల్ పరిశీలనలో ఉంది. క్రియేటివ్ కాన్సెప్ట్స్ రాసుకుంటున్న దర్శకులకు అనుపమ మంచి ఛాయస్ అవుతోంది. అందుకే ఏరికోరి మరీ ఆఫర్లు ఇస్తున్నారు.

ఇవి కాకుండా మలయాళంలో చేస్తున్న జెఎస్కెని ప్యాన్ ఇండియా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. టిల్లు స్క్వేర్ కు ముందు అనుపమ చేసిన ఈగల్ తీవ్రంగా నిరాశపరచగా తమిళంలో జయం రవి సరసన నటించిన సైరెన్ లో కేవలం క్యామియో కావడంతో ఎక్కువ పేరు కీర్తి సురేష్ కు వెళ్ళింది. ఇప్పుడు ఒక్క సక్సెస్ దారి మార్చేసింది. అసలే టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత ఎక్కువగా ఉన్న టైంలో అనుపమ లాంటి సీనియర్లు మళ్ళీ పుంజుకోవడం మంచిదే. సాయిశ్రీనివాస్ తో తను గతంలో రాక్షసుడు చేసింది కానీ అందులో ఎక్కువ స్కోప్ దొరకలేదు. ఈసారి అలాంటి టెన్షన్ ఏమీ ఉండదు.

This post was last modified on April 29, 2024 3:25 pm

Share

Recent Posts

ఫ్యాన్ బుగ్గ గిల్లుడు… షాక్ అయిన హీరోయిన్

ఫిలిం సెలబ్రెటీలు పబ్లిక్‌లోకి రావాలంటే భయపడిపోయే పరిస్థితులు ఉన్నాయిప్పుడు. సోషల్ మీడియా ద్వారా సమాచారం తెలుసుకుని ఎక్కడికైనా సరే జనం…

28 minutes ago

సరిహద్దులు దాటిన పీఓకే బాలిక.. తిరిగి వెళుతుందా?

భారత్- పాకిస్తాన్ సరిహద్దులను ఓ మైనర్ బాలిక దాటి రావడంతో నియంత్రణ రేఖ వద్ద కలకలం రేగింది. నిత్యం అప్రమత్తంగా…

2 hours ago

బిర్యానీ తినడానికే పుట్టినవారు జంతువులు

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…

3 hours ago

ఆరుగురు పతివ్రతలు మళ్ళీ వస్తున్నారు

కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా న‌డుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…

3 hours ago

డెకాయిట్ అత్యాశని దృశ్యం 3 వాడుకుంది

బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…

4 hours ago

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి…

6 hours ago