పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. అగ్ర దర్శకుడు జాగర్లమూడి క్రిష్ డైరెక్షన్లో చేస్తున్న సినిమా గురించి ఇప్పటిదాకా అధికారికంగా ఏ చిన్న అప్ డేట్ లేదు. ఏ హడావుడి లేకుండా జరిగిన సినిమా ప్రారంభోత్సవానికి సంబంధించి ఒకట్రెండు ఫొటోలు మాత్రమే బయటికి వచ్చాయి.
అంతే తప్ప ఇలా ఓ సినిమా మొదలుపెట్టామని.. ఇందులో వీళ్లు వీళ్లు నటిస్తారని.. దీని కథ ఇదని.. టైటిల్ ఇదని.. ఇలా ఏ సమాచారాన్నీ చిత్ర బృందం పంచుకోలేదు. కానీ ఆ సినిమా గురించి ఎప్పటికప్పుడు ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ సినిమా కథ గురించి ఇప్పటికే రకరకాల కథనాలు ప్రచారంలోకి వచ్చాయి.
ఇది మొగలాయిల కాలం నాటి కథ అని.. కోహినూర్ వజ్రం చుట్టూ తిరుగుతుందని.. ఇందులో పవన్ దొంగ పాత్ర పోషిస్తున్నాడని అన్నారు. దీనికి ‘విరూపాక్ష’ అనే టైటిల్ కూడా ప్రచారంలో ఉంది.
ఇక కాస్టింగ్ విషయంలోనూ ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ తమిళ స్టార్ హీరో ఇందులో కీలక పాత్ర పోషించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ హీరో మరెవరో కాదు.. ఏ బ్యాగ్రౌండ్ లేకుండా కోలీవుడ్లో అడుగు పెట్టి పెద్ద స్టార్‌గా ఎదిగిన శివ కార్తికేయన్.
తమిళ హీరోలందరికీ తెలుగులో మార్కెట్ పెంచుకోవాలనుంటుంది. అలా చాలామందే ఇక్కడ మార్కెట్ సంపాదించారు. కార్తికేయన్ కూడా డబ్బింగ్ సినిమాలతో ట్రై చేశాడు కానీ.. వర్కవుట్ కాలేదు. పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరో సినిమాలో నటిస్తే తెలుగులో కచ్చితంగా అతడికి మంచి గుర్తింపే లభిస్తుంది. అతడి టాలెంట్‌కు తగ్గ పాత్రనే క్రిష్ డిజైన్ చేసినట్లు చెబుతున్నారు.
ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయడంలో భాగంగా తమిళం నుంచి శివను తీసుకున్నట్లు చెబుతున్నారు. తమిళ హీరోయినే అయిన నివేథా పెతురాజ్ కూడా ఇందులో ఓ పాత్ర చేయనుందట. ఇక బాలీవుడ్ ప్రేక్షకుల్ని కవర్ చేయడం కోసం జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను లీడ్ హీరోయిన్‌గా తీసుకున్నట్లు చెబుతున్నారు.
This post was last modified on April 27, 2020 5:37 pm
కాజల్ అగర్వాల్.. ఒకప్పుడు టాలీవుడ్లో నంబర్ వన్ హీరోయిన్. సిమ్రన్ తర్వాత ఆ స్థాయిలో ఆధిపత్యం చూపించిన హీరోయిన్ ఆమెనే.…
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర పరిశీలన వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ…
ఆంధ్రప్రదేశ్ రహదారుల అభివృద్ధికి మహర్దశ వచ్చింది. పంచాయతీరాజ్ శాఖ రాష్ట్రవ్యాప్తంగా 157 నియోజకవర్గాల్లో మొత్తం 1299 రహదారి నిర్మాణ–మరమ్మతు పనులను…
ఎప్పుడూ ట్విట్టర్ లో, బయట హడావిడి చేసే ఎలన్ మస్క్ ఇప్పుడు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఇది ఆయనకి ఆయనగా…
తెలుగుదేశం పార్టీ ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 'కాఫీ కబుర్లు' పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కార్యకర్తల్లో…
ఆంధ్రకింగ్ తాలూకా ఫైనల్ రన్ అయిపోయింది. పాజిటివ్ రివ్యూలు, బాగుందని చెప్పిన పబ్లిక్ టాక్స్ ఇవేవి పట్టుమని మూడు వారాల…