2024లో టాలీవుడ్ నుంచి రాబోయే పెద్ద సినిమాలకు విడుదలకు సంబంధించి ఆల్మోస్ట్ ఒక క్లారిటీ వచ్చేసినట్లే. అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ రిలీజ్ డేట్ విషయంలో ఎట్టకేలకు స్పష్టత వచ్చేసింది. మే 9 నుంచి ఈ సినిమా వాయిదా పడగా.. కొత్త డేట్ జూన్ 27కు ఖరారైంది. ఇక మళ్లీ వాయిదాల్లాంటివి ఏమీ ఉండకపోవచ్చు.
ఆ రోజు ‘కల్కి’ రావడం పక్కా. ఇక ఈ ఏడాదిలో రావాల్సిన వేరే భారీ చిత్రాలన్నింటికీ ఆల్రెడీ డేట్లు ఖరారయ్యాయి. అల్లు అర్జున్-సుకుమార్‌ల పాన్ ఇండియా మూవీ ‘పుష్ప-2’ ఆగస్టు 15న విడుదల కానుండగా.. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న మరో పాన్ ఇండియా చిత్రం ‘దేవర’ అక్టోబరు 10కి ఫిక్స్ అయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ ‘ఓజీ’ సైతం సెప్టెంబరు 27కు రిలీజ్ ఖాయం చేసుకుంది.
ఇక తెలుగులో డేట్ ఖరారు కావాల్సిన ఏకైక భారీ చిత్రం.. ‘గేమ్ చేంజర్’ మాత్రమే. మూడేళ్ల కిందట మొదలైన ఈ చిత్రం.. ఎంతకీ పూర్తి కావట్లేదు. కొన్ని నెలల పాటు షూటింగ్ ఆగాక రెండు నెలల కిందటే మళ్లీ షూట్ పున:ప్రారంభించి చకచకా సినిమాను పూర్తి చేసే పనిలో పడింది లేదు. టాకీ పార్ట్ దాదాపుగా పూర్తయినట్లే అంటున్నారు. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనుల సంగతి అంతా చూసుకుని రిలీజ్ డేట్ ఖరారు చేయాల్సి ఉంది. అక్టోబరు డేట్ పరిశీలిస్తున్నారు.
కానీ ఆ నెలలో ఇప్పటికే తీవ్రమైన పోటీ ఉంది. ‘దేవర’తో పాటు రజినీ మూవీ ‘వేట్టయాన్’, సూర్య చిత్రం ‘కంగువ’ కూడా ఆ నెలలోనే రిలీజ్ కావాల్సి ఉంది. మరి ‘గేమ్ చేంజర్’ కోసం ఏ డేట్ ఎంచుకుంటారో చూడాలి. ‘గేమ్ చేంజర్’ షూట్ పూర్తయ్యాక శంకర్ గ్యాప్ తీసుకుని ‘ఇండియన్-2’ రిలీజ్ సంగతి చూడనున్నాడు. ఆ చిత్రం జూన్‌లోనే రిలీజ్ కానుంది. అది విడుదలయ్యాక ‘గేమ్ చేంజర్’ డేట్ ఫిక్స్ చేస్తారేమో.
This post was last modified on April 28, 2024 7:36 pm
కొత్త సినిమా రిలీజ్ అంటే బడ్జెట్ తో సంబంధం లేకుండా ప్రతిదానికి ఎంతో కొంత ఓపెనింగ్ ఇచ్చే ప్రేక్షక వర్గం…
దసరా పండగ సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాల్లో రణబాలి మీద భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మిక…
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్లయిపోయింది. అసలే ఫ్లాపుల్లో ఉన్న అతడికి…
భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…