మొన్నటిదాకా వరస ఫ్లాపులతో ఉక్కిరిబిక్కిరైన నాగార్జున ఈ సంవత్సరం నా సామిరంగతో ఊరట చెందారు. సోగ్గాడే చిన్ని నాయన రేంజ్ బ్లాక్ బస్టర్ కాదు కానీ అంతపోటీని తట్టుకుని నిర్మాతలు లాభాలు తెచ్చింది కాబట్టి హిట్టు కింద వేసుకోవచ్చు. అందుకే వచ్చే ఎడాది కూడా ఎంత కాంపిటీషన్ ఉన్నా సరే తన సినిమా ఒకటి ఉండాలని నాగ్ బలంగా నిర్ణయించుకున్నాడు. ఆ మధ్య ఒక ఈవెంట్ లో మళ్ళీ జనవరిలో కలుద్దాం అన్నారు కూడా. అయితే ప్రస్తుతం చేస్తున్న కుబేర జనవరిలో వచ్చే ఛాన్స్ లేకపోవడంతో దాని స్థానంలో ఇంకో స్కెచ్ ని కింగ్ సిద్ధంగా ఉంచుకున్నట్టు ఫిలిం నగర్ టాక్.
వాటి ప్రకారం నా సామిరంగా తీసిన విజయ్ బిన్నీకే ఇంకో ఛాన్స్ ఇవ్వబోతున్నారట. ఈసారి కూడా రిస్క్ లేకుండా రీజనబుల్ బడ్జెట్ లో తక్కువ కాల్ షీట్లతో పూర్తయ్యేలా రెండు మూడు కథలు అనుకున్నారట. వాటిలో ఒక విదేశీ రీమేక్ ఉందని సమాచారం. అయితే ఫైనల్ వెర్షన్లలో ఏది బెటర్ గా అనిపిస్తే దాన్ని ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. నేటివిటీ సమస్య రాకుండా అన్ని బాషల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా మంచి సబ్జెక్టుని రెడీ చేస్తారని తెలిసింది. ఖచ్చితంగా మూడు నాలుగు నెలల్లో షూటింగ్ మొత్తం పూర్తి చేసేలా ఈసారి కూడా ప్లాన్ చేయబోతున్నారు.
ఇదిలా ఉండగా తమిళ దర్శకుడు అనిల్ తో నాగార్జున ప్లాన్ చేసుకున్న లవ్ యాక్షన్ డ్రామా గురించి ఎలాంటి సౌండ్ లేదు. అసలు ఉంటుందో లేదో కూడా బయటికి చెప్పడం లేదు. ప్యాన్ ఇండియా మూవీ కాబట్టి ఇంకొంచెం సమయం పట్టొచ్చని చెన్నై టాక్. ఆలోగా కుబేర పూర్తవుతుంది. విజయ్ బిన్నీది ఓకే అయితే నవంబర్ లోపు దాని ఫస్ట్ కాపీ సిద్ధమవుతుంది. 2024 బిగ్ బాస్ కొత్త సీజన్ చేయాలా వద్దానే నిర్ణయం నాగార్జున ఇంకా తీసుకోలేదని అంటున్నారు. ఇవన్నీ ఎలా ఉన్నా జనవరిని మాత్రం మిస్ అయ్యేది లేదంటున్న నాగార్జున విజయ్ బిన్నీతోనే ఆ కార్యం పూర్తి చేసేలా ఉన్నారు.
This post was last modified on April 28, 2024 4:24 pm
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…