టాలీవుడ్లో ఎంతోమంది లెజెండరీ డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ల దగ్గర శిష్యరికం చేసి స్టార్ డైరెక్టర్లుగా ఎదిగిన వాళ్లు కూడా ఉన్నారు. కానీ కొత్తతరంలో సుకుమార్ అంతగా శిష్యులను ప్రోత్సహించి వాళ్ల కెరీర్లకు బాటలు వేసే డైరెక్టర్ మరొకరు లేరు అంటే అతిశయోక్తి కాదు. మిగతా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ల శిష్యుల్లో ఎంతమంది దర్శకులుగా మారి మంచి పేరు సంపాదించారు అంటే సమాధానాల కోసం వెతుక్కోవాల్సి ఉంటుంది. కానీ సుక్కు శిష్యరికంతో దర్శకులుగా మారి తమ ముద్ర వేసిన వారి జాబితా పెద్దదే.
‘ఉప్పెన’తో సంచలనం రేపిన బుచ్చిబాబు సానాతో పాటు శ్రీకాంత్ ఓదెల (దసరా), సూర్యప్రతాప్ (కుమారి 21 ఎఫ్, 18 పేజెస్), కార్తీక్ దండు (విరూపాక్ష), హరిప్రసాద్ జక్కా (ప్లే బ్యాక్) లాంటి టాలెంటెడ్ డైరెక్టర్లు సుక్కు శిష్యులే. సరైన సక్సెస్ అందుకోలేకపోయినా దర్శకులుగా మారిన సుక్కు శిష్యులు మరింత మంది ఉన్నారు.
పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరూ తమ శిష్యులను ప్రోత్సహించి డైరెక్టర్లు కావడానికి తోడ్పాటు అందించరు. కానీ సుకుమార్ మాత్రం తన దగ్గర పని చేసే ప్రతి అసిస్టెంట్ డైరెక్టర్ కావాలనుకుంటాడు. వాళ్లకు సొంత బేనర్లో అవకాశం ఇస్తాడు. లేదా బయట అయినా ఛాన్స్ దక్కించుకోవడంలో తోడ్పాటు అందిస్తాడు. అలాగే శిష్యుల సినిమాల ప్రమోషనల్ ఈవెంట్లకు వచ్చి వాళ్ల గురించి గొప్పగా మాట్లాడతాడు. స్టార్ డైరెక్టర్ అనే బేషజం ఏమాత్రం లేకుండా శిష్యులు లేకపోతే తాను లేనన్నట్లు, అంత బాగా సినిమాలు తీసేవాడిని కాదు అన్నట్లు మాట్లాడ్డం సుక్కుకే చెల్లింది.
తాజాగా ‘ప్రసన్న వదనం’ అనే చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్న అర్జున్ గురించి ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సుక్కు ఇలాగే మాట్లాడాడు. 100 పర్సంట్ లవ్, 1 నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో లాంటి లాజిక్‌తో ముడిపడ్డ సినిమాలు అర్జున్ సాయంతోనే రాశాను, తీశానని చెప్పిన సుక్కు.. అతను తన దగ్గర్నుంచి వెళ్లిపోయాక లాజిక్ సినిమాలు చేయడం మానేశానని చెప్పడం విశేషం. ఒక శిష్యుడికి ఈ స్థాయిలో ఎలివేషన్ ఇవ్వడం.. తన అసిస్టెంట్లను ఇంతగా ప్రోత్సహించడం సుక్కుకు మాత్రమే సాధ్యమని సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు కురిపిస్తున్నారు.
This post was last modified on April 27, 2024 5:41 pm
దసరా తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ది ప్యారడైజ్ సినిమా మిశ్రమ స్పందన…
హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…
గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…
మంచి అందగాడు, పెర్ఫామెన్స్ విషయంలోనూ ఢోకా లేదు. అయినా నవదీప్ టాలీవుడ్లో అనుకున్నంత పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. తేజ మూవీ…
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మంచి జోష్ లో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ థియేట్రికల్ రన్ లో సూపర్…
నిన్న కొత్త సినిమాలు చాలా రిలీజయ్యాయి. మాములుగా అయితే థియేటర్లు కిటకిటలాడిపోవాలి. అయితే ఆక్యుపెన్సీలు కొంచెం నెమ్మదిగా ఉన్న నేపథ్యంలో…