యూత్ హీరోల్లో బడ్జెట్ పరంగా ప్రామిసింగ్ గా మారుతున్న సుహాస్ కొత్త సినిమా ప్రసన్నవదనం మే 3 విడుదల కానుంది. నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి దర్శకుడు సుకుమార్ ప్రత్యేక అతిథిగా విచ్చేశారు. ఈ మూవీని ప్రమోట్ చేస్తున్నది మైత్రి కావడంతో సహజంగానే ఆయన రాక ఆశ్చర్యపరిచేది కాదు. ఇదిలా ఉండగా పుష్పలో జగదీష్ పోషించిన కేశవ పాత్రకు ముందు తాను సుహాస్ నే అనుకున్నానని, అప్పటికే హీరోగా నటిస్తున్న విషయం తెలిసి డ్రాప్ అయ్యారట సుకుమార్. బన్నీకి సైతం సుహాస్ మీద ప్రత్యేక ఆసక్తి ఉన్న సంగతి ఈ సందర్భంగా బయట పెట్టారు.
కారణం ఏదైనా ఈ నిర్ణయం ఇద్దరికీ మేలు చేసింది. ఎందుకంటే పెద్ద ఆఫరని ఒకవేళ సుహాస్ కనక పుష్పకు ఎస్ చెప్పి ఉంటే ఇప్పుడు రెండో భాగంలోనూ అదే అసిస్టెంట్ పాత్ర చేయాల్సి వచ్చేది. కానీ సోలో హీరోగా ఇమేజ్ వచ్చాక ఇలా కనిపించడం మార్కెట్ పరంగా ఇబ్బందవుతుంది. దానికి తోడు సుకుమార్ సైతం పెరిగిన సుహాస్ స్టేచర్ కి తగ్గట్టు మార్పులు చేయాల్సి వచ్చేది. దాని వల్ల కథలోని ఒరిజినల్ ఫ్లేవర్ చెడిపోయే ప్రమాదం ఉంది. పైగా జగదీష్ మొహంలో ఉన్న కరుకుదనం సుహాస్ లో ఆ స్థాయిలో కనిపించదు. సో ఏదైనా మన మంచికే అన్నట్టు ఇదంతా సుహాస్ కి ప్లస్సే.
ప్రసన్నవదనం కంటెంట్ మీద టీమ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. ఈ సినిమా దర్శకుడు అర్జున్ సుకుమార్ దర్శకుడు కావడం గమనార్హం. తన దగ్గర అసిస్టెంట్ గా ఉన్నప్పుడు మంచి లాజిక్స్ తో కూడిన కథలు రాసేవాడినని, అతను బిజీ అయ్యాక స్టైల్ మార్చేశానని సుకుమార్ ప్రత్యేకంగా ప్రస్తావించడం విశేషం. సుక్కు శిష్యుడంటే ఒక రకంగా బ్రాండ్ మార్క్ లాంటిది. కుమారి 21 ఎఫ్, దసరా, విరూపాక్ష లాంటి బ్లాక్ బస్టర్లన్నీ ఆయన స్టూడెంట్స్ తీసినవే. మరి ప్రసన్నవదనం కూడా అదే కోవలోకి చేరుతుందో లేదో ఇంకో వారం రోజుల్లో తేలిపోతుంది. చూద్దాం.
This post was last modified on April 27, 2024 2:56 pm
వైసీపీకి డేంజర్ బెల్స్ మోగుతున్నాయా.. ఉత్తరాంధ్రలో తాజాగా చోటు చేసుకున్న చిన్న శ్రీను వ్యవహారంతో పాటు.. పార్టీలో మరింత మంది…
జాంబీ సినిమాలో వైరస్ లాగా ఏఐ వాడకం క్రమంగా టెకీస్ నుంచి సామాన్యుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. ఒకరేమో వారణాసిలో మహేష్…
లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…
ఎన్నికల సమయంలో ఉచిత పథకాలు ప్రకటించే దేశం ఏది అని అడిగితే.. ఠక్కున చెప్పే పేరు భారత్. రాష్ట్రాల అసెంబ్లీల…
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…
మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…