సినిమాల్లోకి వచ్చే ముందు అందరు నటులకు అభిమాన తారలని ఉంటారు. వాళ్లతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వచ్చినపుడు ఎగ్జైట్మెంట్ వేరుగా ఉంటుంది. ప్రతి మూమెంట్‌ను ప్రత్యేకంగా మార్చుకుంటారు ఐతే తాము ఎంతగానో అభిమానించే ఆర్టిస్టును సన్నివేశంలో భాగంగా గట్టిగా కొట్టాల్సి వస్తే..? తనకు ఇదే అనుభవం ఎదురైతే చాలా ఇబ్బంది పడిపోయానని అంటోంది టాలీవుడ్లో వెలిగిపోతున్న బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్. తనకు షాహిద్ కపూర్ అంటే చాలా ఇష్టమని ఆమె కెరీర్ ఆరంభం నుంచే చెబుతోంది. ఆ హీరోతో కలిసి ఆమె హిందీ ‘జెర్సీ’ చేసింది. ఇందులో ఒక చోట హీరోను హీరోయిన్ చెంపదెబ్బ కొడుతుందన్న సంగతి తెలిసిందే. తెలుగులో నాని-శ్రద్ధ మధ్య వచ్చే ఆ సన్నివేశం బాగా పండింది.
ఐతే హిందీలో తాను ఈ సన్నివేశం చేయడం చాలా కష్టమైందని మృణాల్ చెప్పింది. “నేను షాహిద్ కపూర్ ఫ్యాన్. ఆయనతో కలిసి నటించే అవకాశం రాగానే వెంటనే ఓకే చెప్పేశా. మొదాటి రోజు షూటింగ్‌లో ఆయన నవ్వు చూస్తూ అలా ఉండిపోయాను. మీ నవ్వు తెరపై ఎలా ఉందో నిజంగా కూడా అంతే బాగుందని ఆయనకు చెప్పా. షాహిద్‌తో కలిసి నటించిన క్షణాలను మరిచిపోలేను. అంత పెద్ద స్టార్‌తో నటించాలంటే మొదట ఇబ్బందిగా అనిపించింది. వారం రోజుల తర్వాత కొంచెం అలవాటు పడ్డాను. కానీ ఒక సన్నివేశంలో షాహిద్‌ను కొట్టాలని అనగానే భయపడ్డాను. నేను నెమ్మదిగా కొడతా ఎడిటింగ్‌లో చూసుకోండి అని చెప్పా. కానీ దర్శకుడు మాత్రం నిజంగా గట్టిగా కొట్టాలని అన్నాడు. ‘మీ మాజీ బాయ్ ఫ్రెండ్‌ను గుర్తు చేసుకుని నన్ను కొట్టండి’ అని షాహిద్ జోక్ చేశాడు. ఆ సీన్ తీయడానికి మూడు గంటలు పట్టింది. ఎలాగోలా పూర్తి చేశా” అని మృణాల్ చెప్పింది.
This post was last modified on April 25, 2024 6:16 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…