ఇండియాలో ఆరు నెలలకు పైగా థియేటర్లు మూతపడి ఉన్నాయి. ఇదిగో అదిగో అంటున్నారు కానీ.. థియేటర్లు ఎంతకీ తెరుచుకోవట్లేదు. దీంతో తమ సినిమాలను థియేటర్లలోనే రిలీజ్ చేయాలనుకున్న వాళ్లు కాస్తా.. ఓటీటీల వైపు అడుగులేస్తున్నారు. ఇప్పటికీ కొందరు మాత్రం థియేటర్ల మీదే ఆశలు పెట్టుకుని తమ సినిమాలను హోల్డ్ చేశారు.
ఐతే థియేటర్లు పున:ప్రారంభం అయినా కరోనా ముప్పు కొనసాగుతున్న నేపథ్యంలో అనేక నియమ నిబంధనల మధ్య వాటిని రన్ చేయాల్సి ఉంటుంది. థియేటర్లలో సగం సీట్లనే నింపాల్సి ఉంటుంది. శానిటైజేషన్, థర్మల్ స్క్రీనింగ్ లాంటివి అదనపు భారమే. ఇన్ని చేసినా జనాలు థియేటర్లకు వస్తారా లేదా అన్నది సందేహం.
ఇలాంటి పరిస్థితుల్లో చిన్న సినిమాలను థియేటర్లలో రిలీజ్ చేస్తే జనాలు అసలే పట్టించుకోకపోవచ్చు. పెద్ద సినిమాలను రిలీజ్ చేస్తే ఆశించిన రెవెన్యూ లేక నష్టాలు తప్పకపోవచ్చు. దీంతో అయోమయ పరిస్థితి నెలకొంది.
ఐతే జనాలు బయట అన్నిచోట్లా స్వేచ్ఛగా తిరిగేస్తున్న నేపథ్యంలో థియేటర్లకు కూడా వస్తారని కొందరంటున్నారు కానీ.. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు చూస్తే నిరాశాజనకంగానే ఉన్నాయి. ప్రపంచ సినిమాలో మోస్ట్ అవైటెడ్ మూవీ అనదగ్గ క్రిస్టోఫర్ నోలన్ మూవీ ‘టెనెట్’ను విడుదల చేస్తే దానికే బాక్సాఫీస్ దగ్గర నిరాశాజనక ఫలితం వచ్చింది. నెల రోజుల్లో అలవోకగా 500 మిలియన్ డాలర్లు కొల్లగొట్టే సత్తా ఉన్న ఆ సినిమా కరోనా పుణ్యమా అని ఇప్పటిదాకా 205 మిలియన్ డాలర్లతో సరిపెట్టుకుంది. ఈ చిత్రం 250 మిలియన్ డాలర్లు వసూలు చేస్తేనే బ్రేక్ ఈవెన్‌కు వస్తుందట.
నోలన్ సినిమా, అది కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నది బ్రేక్ ఈవెన్ కాలేకపోతోందంటే వరల్డ్ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. దీని గురించి వార్తలు చూసిన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ జనాల్లో ఆందోళన ఇంకా పెరిగిపోయింది. థియేటర్లు తెరుచుకున్నా కొత్త సినిమాలను విడుదల చేస్తే ఆశించిన రెవెన్యూ రాకపోవచ్చని, ఇన్ని నెలలు ఆగి కూడా ప్రయోజనం ఉండదని వాళ్లు ఆందోళన చెందుతున్నారు. ఒకప్పట్లా థియేటర్లు మామూలుగా నడిచే పరిస్థితులు ఎప్పటికి వస్తాయో అని ఆవేదన చెందుతున్నారు. ‘టెనెట్’ పరిస్థితి చూశాక మరిన్ని పెద్ద సినిమాలు ఓటీటీల వైపు అడుగులు వేస్తే ఆశ్చర్యం లేదేమో.
This post was last modified on September 16, 2020 3:42 pm
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…