Movie News

మాస్ మహారాజా సినిమాకు మోహన్ బాబు టైటిల్

పాత టైటిల్స్ వాడుకోవడం కొత్తేమి కాదు కానీ ఇప్పుడదే ట్రెండ్ గా మారుతోంది. నిర్మాణంలో ఉన్న తమ్ముడు, సుందరకాండ వగైరాలన్నీ అదే క్యాటగిరీలోకి వస్తాయి. తాజాగా మాస్ మహారాజా రవితేజ కోసం దర్శకుడు అనుదీప్ అలాంటి పేరునే తీసుకున్నట్టు లేటెస్ట్ అప్డేట్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించబోయే ఎంటర్ టైనర్ కు దాదాపు ఇది ఫిక్స్ అయినట్టేనని టాక్. 1992 లో మోహన్ బాబు హీరోగా దొంగ పోలీస్ వచ్చింది. కెమెరామెన్ కెఎస్ ప్రకాష్ దర్శకత్వం వహించగా మమతా కులకర్ణి హీరోయిన్. బప్పీలహరి సంగీతం. కమర్షియల్ గా పే చేసింది కానీ కలెక్షన్ కింగ్ రేంజ్ లో ఆడలేదు.

తర్వాత 2013లో నిఖిల్ నటించిన ఇంకో దొంగ పోలీస్ వచ్చింది కానీ అది ప్రేక్షకుల దృష్టికి రానంతగా ఫ్లాప్ అయ్యింది. తిరిగి ఇన్నేళ్ల తర్వాత మాస్ రాజా కోసం వాడుతున్నారు. జాతిరత్నాలు బ్లాక్ బస్టర్ తర్వాత అనుదీప్ కు తమిళంలో స్టార్ హీరో శివ కార్తికేయన్ తో ప్రిన్స్ రూపంలో మంచి ఛాన్స్ దక్కింది. అయితే అది రెండు భాషల్లో అంచనాలు అందుకోవడంలో విఫలం కావడంతో ఈసారి దొంగ పోలీస్ కోసం ఎక్కువ ఫోకస్ పెడుతున్నాడు. రవితేజ మార్క్ వినోదంతో పాటు కమర్షియల్ టచ్ బలంగా ఇస్తున్నట్టు తెలిసింది. విక్రమార్కుడు రేంజ్ దొంగగా మాస్ రాజా దర్శనమిస్తాడట.

ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ పూర్తి చేసే పనిలో ఉన్న రవితేజ మొత్తం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి ఎన్ని కమిట్మెంట్స్ ఇచ్చాడో అంతు చిక్కడం లేదు. వేగంగా పూర్తి చేయడంతో పాటు బిజినెస్ పరంగా మంచి మార్కెటింగ్ చేయడంతో మాస్ మహారాజా వీళ్ళతోనే చేసేందుకు ఎక్కువ సుముఖత చూపిస్తున్నాడు. ధమాకా నుంచి ఈ బాండింగ్ బాగా బలపడింది. స్పీడ్ విషయంలో రవితేజ తగ్గేదేలే అంటున్నాడు. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ ఫలితాలు నిరాశపరిచినప్పటికే మిస్టర్ బచ్చన్ మాత్రం మంచి కంబ్యాక్ అయ్యేలా ఉంది. హిందీ సూపర్ హిట్ రైడ్ అధికారిక రీమేక్ ఇది.

This post was last modified on April 25, 2024 1:20 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

1 hour ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

3 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

3 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

4 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

4 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

5 hours ago