కొండంత ఆశలు మోసుకొచ్చి నిరాశపరిచిన ది ఫ్యామిలీ స్టార్ కేవలం 21 రోజులకే ఓటిటిలో రానుండటం షాక్ కలిగించే విషయం. ఎంత డిజాస్టరైనా కనీసం నాలుగు వారాల గ్యాప్ మెయింటైన్ చేస్తున్న తరుణంలో ఇంకా కొద్దోగొప్పో థియేటర్లలో ఆడుతుండగానే డిజిటల్ లోకి వచ్చేయడం తీవ్రమైన షాక్ కాదు కానీ అనూహ్యమే. ఏప్రిల్ 26 అంటే రేపటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో దీన్ని చూడొచ్చని లేటెస్ట్ అప్డేట్. సదరు సంస్థ అఫీషియల్ ఎక్స్ హ్యాండిల్ లో దీని గురించి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు కానీ హఠాత్తుగా కొత్త సినిమాలను అర్ధరాత్రి స్ట్రీమింగ్ చేయడం ప్రైమ్ కు కొత్తేమీ కాదు.
నిజానికి మే 3న వస్తుందని గత వారం లీక్ వచ్చింది. ఇప్పుడు ఒక వారం ముందుకు జరపడంలో ఆంతర్యం ఏమిటనే సందేహం రావొచ్చు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం సాధారణంగా ప్రైమ్ అగ్రిమెంట్ చేసుకున్న టైం కన్నా ముందుగా రిలీజ్ చేసే అవకాశం ఉంటే ఎక్కువ మొత్తం ఆఫర్ చేసి ఒప్పందాన్ని మార్చుకుంటుంది. స్టార్ హీరోల సినిమాలు ఫ్లాప్ అయిన సందర్భాల్లో ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇప్పటికే ది ఫ్యామిలీ స్టార్ నష్టాలు గుదిబండగా మారిన తరుణంలో దాన్ని బాగా తగ్గించుకోవాలంటే ఇదొక్కటే మార్గం. అందుకే దిల్ రాజు ఎర్లీ ప్రీమియర్ కు ఎస్ చెప్పారని వినికిడి.
నెట్ ఫ్లిక్స్ లో టిల్లు స్క్వేర్ వస్తున్న రోజే ప్రైమ్ ఇలా ది ఫ్యామిలీ స్టార్ ని దింపడం పోటీ వ్యూహంలో భాగమని విశ్లేషకులు అంటున్నారు. ఇటీవలి కాలంలో కంటెంట్ పరంగా ప్రైమ్ కొంత వెనుకబడింది. తెలుగు తమిళ చిత్రాలను నెట్ ఫ్లిక్స్ భారీ రేట్లు పెట్టి వరసగా కొనేయడం ఇబ్బందిగా పరిణమించింది. అందుకే ఈ కాంపిటీషన్ ఎదురుకోవడానికి అమెజాన్ వేస్తున్న స్ట్రాటజీల్లో భాగంగా ఇలా సెట్ చేస్తున్నారనే కామెంట్లో నిజం లేకపోలేదు. పరశురామ్ దర్శకత్వం వహించిన ది ఫ్యామిలీ స్టార్ సగానికి పైగానే పెట్టుబడి నష్టం మిగిల్చింది. కొత్త సినిమాలతో ఈ వారం ఓటిటి లవర్స్ కి పండగే.
This post was last modified on April 25, 2024 10:17 am
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్‌రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…