మరో సినిమా జంట పెళ్లితో ఒక్కటైంది. కొంత కాలంగా ప్రేమలో ఉన్న మలయాళ ఆర్టిస్టులు అపర్ణ దాస్, దీపక్ పరంబోల్ పెళ్లి చేసుకున్నారు. మలయాళ నటి, నటుడు పెళ్లాడితే మనకేంటి అనుకోవచ్చు. వీళ్లిద్దరూ తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. గత ఏడాది విడుదలైన మెగా కుర్రాడు వైష్ణవ్ తేజ్ సినిమా ‘ఆదికేశవ’లో హీరో సోదరిగా అపర్ణ కీలక పాత్ర పోషించింది.
ఇక ఇటీవలే బ్లాక్‌బస్టర్ అయిన ‘మంజుమ్మల్ బాయ్స్’లో దీపక్ పరంబోల్ ముఖ్య పాత్ర చేశాడు. మలయాళ సినీ చరిత్రలోనే భారీ చిత్రాలకు కూడా సాధ్యం కాని విధంగా రూ.200 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టిన సినిమాలో కీలక పాత్రతో దీపక్‌కు మంచి పేరే వచ్చింది. తెలుగులో కూడా ఈ సినిమా బాగా ఆడింది.
అపర్ణకు తమిళంలో మంచి పేరే ఉంది. ఆమె కెరీర్లో బెస్ట్ ఫిలిం.. డడా. ‘బిగ్ బాస్’ ఫేమ్ కవిన్ హీరోగా నటించిన ఈ చిత్రంలో అపర్ణ తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఈ చిత్రం ఓటీటీ ద్వారా వేరే భాషా ప్రేక్షకులకు కూడా చేరువైంది. ఈ సినిమాలో పెర్ఫామెన్స్ తర్వాతే అపర్ణకు తెలుగులో ‘ఆదికేశవ’ చిత్రం చేసే అవకాశం వచ్చింది. తమిళం, మలయాళంలో కలిసి అపర్ణ రెండంకెల సంఖ్యలో సినిమాలు చేసింది.
దీపక్ కూడా చాలా సినిమాల్లోనే నటించాడు. వీళ్లిద్దరూ రెండేళ్ల కిందట్నుంచి ప్రేమలో ఉన్నారు. ఇటీవలే వీరి పెళ్లి గురించి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. ఇప్పుడా ప్రచారాన్ని నిజం చేస్తూ సన్నిహితుల సమక్షంలో సింపుల్‌గా పెళ్లి చేసుకుని ఒక్కటైందీ జంట.
This post was last modified on April 24, 2024 3:17 pm
ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ లో నటించాక ఏ హీరోయిన్ కైనా ఆఫర్ల వర్షం కురుస్తుంది. కానీ కెజిఎఫ్ రెండు భాగాల్లో…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటి రెండు పెద్ద సినిమాలు సెట్స్ మీదుంచి వాటిని బ్యాలన్స్ చేయడం ఎంతటి అగ్ర నిర్మాతలకైనా సరే…
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న గాలి భానుప్రకాష్ నాయుడు.. దూకుడు ప్రదర్శిస్తున్నారు. యువ ఎమ్మెల్యేగా…
ఈ ఏడాది జరిగిన ఏపీ ఎన్నికల సమయంలోనూ.. తర్వాత కూడా.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఓ ప్రశ్న…
ఈ టాపిక్ అల్లు అర్జున్ కోర్టు కేసు, బెయిలు గురించి కాదులెండి. ఆ వ్యవహారం న్యాయస్థానంలో జరుగుతోంది కాబట్టి దాని…
దర్శకుడు, నటుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజకు ఇండస్ట్రీలో మంచి పేరుంది. ఆయన ఏం మాట్లాడి నా ఆలోచించి.. మాట్లాడతారు.. ఏం…