Movie News

ప్రశాంత్ నీల్ కు అంత టైం ఎక్కడిది

కొన్ని కాంబోలు కోరుకుంటాం కానీ అంత సులభంగా తెరకెక్కవు. టైం పడుతుంది లేదా కలగానే మిగిలిపోతుంది. ఇవాళ హైదరాబాద్ లో దర్శకుడు ప్రశాంత్ నీల్ ని హీరో విజయ్ దేవరకొండ వ్యక్తిగత కార్యదర్శి కలిశాడు . అంతే ఈ కాంబోలో సినిమా వస్తుందని, త్వరలోనే ఈ కలయికలో ప్యాన్ ఇండియా మూవీ చూడొచ్చని ఏవేవో అల్లేశారు. వాస్తవానికి జరిగింది వేరు. పూర్తి వివరాలు అందుబాటులోకి రాలేకపోయినా ఈ మీట్ జరిగిన ఉద్దేశంలో ఎలాంటి ప్రత్యేకత లేదు.  రౌడీ హీరోతో నీల్ కు పరిచయం ఉంది కానీ ఏదైనా ప్రాజెక్టు చేయాలనే తలంపు కానీ ఆలోచన  కానీ ఇప్పటికిప్పుడు లేవు.

ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఇది ఎందుకు అసాధ్యమో అర్థమవుతుంది. ముందు సలార్ పార్ట్ 2 శౌర్యంగపర్వం మొదలుపెట్టాలి. ఎంతలేదన్నా ఏడాదికి పైగానే షూటింగ్ పడుతుంది. పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్లు ఇంకో ఆరు నెలలు వేసుకోవచ్చు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో మైత్రి మూవీ  మేకర్స్ తలపెట్టిన ప్యాన్ ఇండియా మూవీ స్క్రిప్ట్ ని పూర్తి చేసి ఫైనల్ వెర్షన్ లాక్ చేసుకోవాలి. దాని షూట్ వచ్చే ఏడాది ప్రారంభించే తీరాలి. సో ప్రశాంత్ నీల్ ఫ్రీ అవ్వాలంటే ఎంతలేదన్నా 2026 దాటిపోతుంది. ఆ తర్వాత రామ్ చరణ్ తో ఒక ప్రతిపాదన ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉంది.

ఇంత క్లిష్టమైన షెడ్యూల్ లో ప్రశాంత్ నీల్ ఇతర హీరోల గురించి ఆలోచించే పరిస్థితిలో లేడు. పైగా విజయ్ దేవరకొండ మార్కెట్ ఏమో కానీ వరస ఫ్లాపులతో ఇమేజ్ మాత్రం ఇబ్బంది పడుతోంది. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో భారీ చిత్రం చేస్తున్న రౌడీ హీరో కొంత కాలం పాటు దాని మీదే పూర్తి దృష్టి పెట్టబోతున్నాడు.  భారీ ఆశలు పెట్టుకున్న ఖుషి పూర్తి స్థాయి ఫలితం అందుకోకపోవడంతో పాటు ది ఫ్యామిలీ స్టార్ డిజాస్టర్ దెబ్బకు అలెర్ట్ అయిపోయి జాగ్రత్తగా ఉంటున్నాడట. నీల్ సంగతేమో కానీ కొన్నేళ్ల క్రితం సుకుమార్ తో లాక్ చేసుకున్న సినిమా చేజారడం బ్యాడ్ లక్కే. 

This post was last modified on April 23, 2024 4:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

4వ దెయ్యంతో లారెన్స్ రిస్కు!

హారర్ కామెడీ జానర్‌లో ప్రేక్షకులని ఆకట్టుకున్న కాంచన సిరీస్‌లో మరో సినిమా రాబోతోన్న విషయం తెలిసిందే. రాఘవ లారెన్స్ దర్శకత్వం…

7 minutes ago

వైసీపీకి ప్ర‌మోట‌ర్స్ కావ‌లెను… !

ఏపీ ప్రతిప‌క్షం వైసీపీకి ప్ర‌మోట‌ర్స్ కావాలా? పార్టీని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లే.. వ్యూహాలు ర‌చించ‌డంతోపాటు.. ప్ర‌జ‌ల‌కు పార్టీని చేరువ చేసేందుకు ప్ర‌మోట‌ర్ల…

42 minutes ago

ముందు రోజు ప్రీమియర్లు….జెండా ఊపిన బచ్చల మల్లి!

కొత్త సినిమాలకు ముందు రోజు ప్రీమియర్లు వేయడం కొత్త కాకపోయినా ఇది రెండువైపులా పదునున్న కత్తిలా మారడంతో ఉపయోగాలు ఎన్ని…

54 minutes ago

చరణ్ భుజాల మీద భారతీయుడి బరువు!

మెల్లగా గేమ్ ఛేంజర్ గేరు మారుస్తోంది. ఇప్పటికే మూడు పాటలు, ఒక టీజర్ వచ్చాయి. ఎల్లుండి జరగబోయే యుఎస్ ప్రీ…

2 hours ago

వైసీపీ హయాంలో వ్యూహం సినిమాకు 2.15 కోట్లు

ఏపీ ఫైబర్ నెట్ సంస్థపై వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అవకతవకల గురించి ఆ సంస్థ చైర్మన్ జీవీ…

2 hours ago

బేబీని టెన్షన్ పెడుతున్న పుష్ప 2?

బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…

3 hours ago