Movie News

కల్కి పరిశీలనలో కొత్త డేట్

అంతా అనుకున్న ప్రకారం జరిగితే ఈ పాటికి ప్రభాస్ మెగా మూవీ ‘కల్కి 2898 ఏడీ’ విడుదలకు కౌంట్ డౌన్ నడుస్తుండాలి. ఇంకో రెండు వారాల్లోనే సినిమా రిలీజ్ కావాల్సింది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యానికి తోడు ఎన్నికలు, ఐపీఎల్ హడావుడి కారణంగా మే 9న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడం కష్టమని భావించి ‘కల్కి’ని వాయిదా వేసేసింది. కానీ ఈ విషయం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కొత్త డేట్ ఎంచుకున్నాక నేరుగా ఫలానా తేదీన రిలీజ్ అని ప్రకటించాలని చూస్తున్నారు. కానీ ఆ విషయంలో ఎంతకీ ఒక నిర్ణయానికి రాలేకపోతోంది టీం.

కల్కి రిలీజ్ డేట్‌తో చాలా విషయాలు ముడిపడి ఉండడమే అందుక్కారణం. ఓవైపు బయ్యర్లు ఓ డేట్ చెబుతుంటే.. ఇంకోవైపు ఆల్రెడీ డిజిటిల్ రైట్స్ తీసుకున్న సంస్థ ఫలానా టైంలో రిలీజ్ చేయాలని కండిషన్ పెడుతోందట. టీంలోనూ రిలీజ్ డేట్ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఐతే రకరకాల అంశాలను పరిశీలించాక ఓ కొత్త డేట్‌ను కల్కి టీం సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు సమాచారం. జూన్ 27న ‘కల్కి’ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశాలున్నట్లు తాజా సమాచారం. బయ్యర్లేమో మే చివర్లోనే సినిమాను రిలీజ్ చేసేయాలని.. వేసవి సీజన్‌ను వృథా చేసుకోవద్దని అంటుంటే.. ఆ సమయానికి సినిమాను రెడీ చేయడం కష్టమన్న ఉద్దేశంతో జూన్ చివరి వారం మీద టీం ఫోకస్ పెట్టిందట. దాదాపుగా ఇదే డేట్ ఖరారు కావచ్చని అంటున్నారు. మరి కొన్ని రోజుల్లోనే ఈ విషయంపై ఫైనల్ కాల్ తీసుకుని కొత్త డేట్ అనౌన్స్ చేస్తారట.

‘కల్కి’ షూటింగ్ ఇప్పటికే పూర్తి కాక విదేశాల నుంచి రావాల్సిన వీఎఫెక్స్ కంటెంట్ కోసం టీం ఎదురు చూస్తోంది. అది సంతృప్తికరంగా ఉంటే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఒక కొలిక్కి వచ్చేస్తాయి. జూన్ మధ్యకల్లా ఫస్ట్ కాపీ రెడీ కావచ్చని.. ప్రమోషన్లు అవీ చేసుకుని నెలాఖరులో సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవాలని టీం చూస్తోందట.

This post was last modified on April 21, 2024 4:25 pm

Share

Recent Posts

ఎవరూ పట్టించుకోని ‘యుగంధర్’ పోరాటం

కొత్త సినిమా రిలీజ్ అంటే బడ్జెట్ తో సంబంధం లేకుండా ప్రతిదానికి ఎంతో కొంత ఓపెనింగ్ ఇచ్చే ప్రేక్షక వర్గం…

18 minutes ago

మంచి ఆలోచన చేసిన రణబాలి

దసరా పండగ సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాల్లో రణబాలి మీద భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మిక…

4 hours ago

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

11 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

12 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

12 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

12 hours ago