Movie News

రజనీకాంత్ మూవీలో నాగార్జున ?

సూపర్ స్టార్ రజనీకాంత్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కలయికలో రూపొందబోయే భారీ చిత్రం తాలూకు అప్డేట్స్ ఫ్యాన్స్ కి మాములు కిక్ ఇవ్వడం లేదు. హీరోయిజంకి గూస్ బంప్స్ తేవడంలో కొత్త డెఫినేషన్లు రాస్తున్న ఈ క్రియేటివ్ డైరెక్టర్ చేతిలో తలైవర్ ఏ రేంజ్ లో కనిపిస్తాడోని అభిమానులు భారీ అంచనాలు పెట్టేసుకున్నారు. ఈ వారంలోనే టైటిల్ రివీల్ చేయబోతున్న సంగతి తెలిసిందే. 80 దశకంలో దేశాన్ని ఊపేసిన బంగారం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ ని తీసుకున్న లోకేష్ ఈసారి రజని క్యారెక్టరైజేషన్ పరంగా ఇప్పటిదాకా ఎవరూ చూపించని తరహాలో చాలా ప్రయోగాలు చేయబోతున్నాడట.

అసలు పాయింట్ కు వస్తే ఇందులో ఒక ముఖ్యమైన పాత్ర కోసం కింగ్ నాగార్జునని సంప్రదించినట్టు తెలిసింది. ప్రాధమికంగా చర్చల్లో సానుకూల స్పందన వచ్చిందట. మల్టీస్టారర్స్ చేసేందుకు ఈ మధ్య కాలంలో నాగ్ ఆసక్తి చూపిస్తున్నారు. ధనుష్ కుబేరలో ఆల్రెడీ నటిస్తున్న సంగతి తెలిసిందే. శేఖర్ కమ్ముల ఎంతో అవసరమైతే తప్ప ఇలాంటి స్టార్ కలయికను సెట్ చేసుకోరు. సో అల్లుడు తర్వాత ఇప్పుడు మామ కాంబోకి నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఖచ్చితంగా అది స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది. ఇంకా అధికారిక ప్రకటన లాంటివేం రాలేదు కానీ సోర్స్ అయితే బలంగా వినిపిస్తోంది.

ప్రస్తుతం రజని వెట్టాయన్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. అక్టోబర్ రిలీజ్ చెప్పేశారు కనక షూట్ వేగం పెంచారు. లోకేష్ ది వేసవి తర్వాత సెట్స్ పైకి తీసుకెళ్తారు. రజని, నాగ్ లు కలిసి నటిస్తే ఫ్యాన్స్ కి అంతకన్నా కావాల్సింది ఏముంటుంది. గతంలో ఈ ఇద్దరూ ఒకే కథతో 1991లో శాంతి క్రాంతిలో నటించారు. తెలుగులో నాగ్, తమిళంలో రజనీకాంత్ చేశారు. కలిసి స్క్రీన్ ని పంచుకునే ఛాన్స్ దక్కలేదు. ఇన్నేళ్లకు అది సాధ్యమైతే ఫ్యాన్స్ కి స్పెషల్ న్యూస్ అవుతుంది. అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్న ఈ భారీ చిత్రానికి సన్ పిక్చర్స్ నాలుగు వందల కోట్ల బడ్జెట్ పెడుతోందని చెన్నై టాక్.

This post was last modified on April 21, 2024 10:21 am

Share

Recent Posts

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

7 minutes ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

46 minutes ago

నాగవంశీ కారణాలు నమ్మశక్యంగా ఉన్నాయా

నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…

1 hour ago

తమిళ రాజకీయాల్లోకి ఇంకో స్టార్?

జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో తమిళ రాజకీయాల్లో చాలా ఏళ్ల కిందటే ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది.…

1 hour ago

ట్రెండింగ్ సాంగ్ ‘జిలేబి’ని ఎవరు వాడుకుంటారో

ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…

3 hours ago

జ్ఞానేష్ కుమార్‌ను ఇప్పటికిప్పుడు తొలగించలేం

కేంద్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ జ్ఞానేష్ కుమార్‌ను ఉద్దేశించి సుప్రీంకోర్టు హెచ్చ‌రిక చేసింది. ఆయన త‌ప్పు చేసిన‌ట్టు నిరూపిత‌మైతే.. క‌చ్చితంగా…

3 hours ago