ఏదో యధాలాపంగా లేదా ముఖాముఖీలో అవతలి వ్యక్తి అడిగాడని ఏదేదో మాట్లాడేస్తే సోషల్ మీడియా వ్యవహారాలు ఒక్కోసారి చాలా దూరం వెళ్లిపోతాయి. తాజాగా జరిగిన ఉదంతమే మంచి ఉదాహరణ. ప్రముఖ కెమెరామెన్ ఛోటా కె నాయుడు ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రామయ్య వస్తావయ్యా చేస్తున్న టైంలో దర్శకుడు హరీష్ శంకర్ వల్ల ఇబ్బంది పడ్డానని, చెప్పిన మాట వినకుండా అలా ఇలా అని సతాయిస్తే సరేలేనని ఆయన చెప్పిన ప్రకారం చేసుకుంటూ పోయానని చెప్పుకొచ్చారు. అంటే అర్థం చేసుకునే తత్వం హరీష్ లో లేదనే కోణంలో ఈ మాటలు బయటికి వెళ్లాయి.
దీంతో ఎక్స్ వేదికగా హరీష్ శంకర్ స్వయంగా స్పందించాడు. ఛోటాను ఉద్దేశించి మెసేజ్ పెడుతూ వందకు పైగా ఇంటర్వ్యూలు ఇచ్చిన తాను ఏనాడూ మీ గురించి నెగటివ్ గా మాట్లాడలేదని, రామయ్య వస్తావయ్యా టైంలో వేరే కెమెరామెన్ ని పెట్టుకుందామనే ఆలోచన వచ్చినప్పుడు దిల్ రాజు గారి మాట మీద, గబ్బర్ సింగ్ తర్వాత గర్వం వచ్చిందనుకుంటారనే ఉద్దేశంతో ఇబ్బంది పడుతూనే మీతో షూట్ చేసుకున్నానని వివరించాడు. యాంకర్ అడగకపోయినా తన గురించి అవమానంగా మాట్లాడ్డం పట్ల హరీష్ శంకర్ అభ్యంతరం చెబుతున్న వైనం సుదీర్ఘమైన సందేశంలో కనిపించింది.
మీతో పని చేసిన అనుభవం ఎంత బాధ పెట్టినా మీ అనుభవం గురించి కొంత నేర్చుకున్నాను కాబట్టే గౌరవం చూపిస్తున్నానని, లేదూ ఇక్కడితో వదిలేయకుండా కెలుకుతూనే ఉంటానంటే మాత్రం ఏ టైం అయినా సరే వెయిట్ చేస్తుంటానని పవన్ కళ్యాణ్ ఇంటర్వెల్ స్టైల్ లో ముగింపు ఇచ్చారు. నిజానికిది ఛోటా ఇటీవలే ఇచ్చిన ఇంటర్వ్యూనా లేక పాతదా అనే క్లారిటీ పూర్తిగా లేకపోయినా వైరల్ అయిపోయి మ్యాటర్ దర్శకుడి దాకా వెళ్లడంతో రచ్చ ఆన్ లైన్ కు వచ్చింది. ఇలా జరగడం ఇది మొదటిసారి కాదంటున్న హరీష్ శంకర్ మాటలకు తిరిగి చోటా కె నాయుడు స్పందిస్తారో లేదో చూడాలి.
This post was last modified on April 20, 2024 6:30 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…