ఆరేళ్ళ క్రితం 2018లో వచ్చిన ఆరెక్స్ 100 సెన్సేషనల్ హిట్ తో ప్రేక్షకుల దృష్టిలో పడ్డ హీరో కార్తికేయకు ఆ తర్వాత ఏళ్ళ తరబడి సక్సెస్ దూరంగా నిలిచిపోయింది. చేసినవన్నీ దాదాపు డిజాస్టర్లే, హిప్పీ, గుణ 369, చావు కబురు చల్లగా, 90 ఎంఎల్, రాజా విక్రమార్క ఒకదాన్ని మించి మరొకటి టపా కట్టాయి. విలన్ గా ట్రై చేసిన వాటిలో నాని గ్యాంగ్ లీడర్ నిరాశ పరచగా అజిత్ వలిమై కమర్షియల్ గా సక్సెస్ అందుకున్నా తమిళంలోనూ పెద్దగా ఆఫర్లేం రాలేదు. గత ఏడాది బెదురులంక 2012 ఊరట కలిగించింది. మరీ గొప్పగా ఆడకపోయినా వసూళ్ల పరంగా హిట్టు స్టాంపుతోనే బయట పడింది.
ఇప్పుడు కార్తికేయ ఆశలన్నీ భజే వాయు వేగం మీదే ఉన్నాయి. యువి కాన్సెప్ట్స్ సంస్థ నిర్మాణంలో ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహించగా యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో రూపొందించారు. టీజర్ కట్ ఆసక్తికరంగా ఉంది. చిన్నప్పుడు తండ్రికిచ్చిన మాట కోసం పెద్దయ్యాక ఓ యువకుడు డ్రగ్స్ మాఫియాని ఎదురుకుని ప్రాణాలకు తెగించి చేసే సాహసం చుట్టూ స్టోరీని అల్లుకున్నారు. కథని పూర్తిగా ఓపెన్ చేయకపోయినా టైటిల్, టీజర్ రెండింటిని బట్టి ఒక అంచనాకు రావొచ్చు. సోలో హీరోగా ఇంత సీరియస్ యాక్షన్ జానర్ కార్తికేయ ట్రై చేయడం ఇదే మొదటిసారని చెప్పాలి.
విడుదల తేదీ ఇంకా నిర్ణయించలేదు కానీ మే 3 లేదా ఆపై రెండు లేదా మూడో వారం ఆప్షన్లుగా చూస్తున్నారు. ఈ మధ్య యువి తీస్తున్న మీడియం బడ్జెట్ సినిమాలు బాగా వర్కౌట్ అవుతున్నాయి. విశ్వక్ సేన్ గామి ఈజీగా గట్టెక్కగా, శ్రీవిష్ణు ఓం భీం బుష్ సైతం సేఫ్ గేమ్ ఆడేసింది. అందుకే భజే వాయు వేగం కూడా అదే తరహాలో వర్కౌట్ అవుతుందనే నమ్మకం టీమ్ లో ఉంది. ఏదో ఒకటి విభిన్నంగా చేస్తే తప్ప ప్రేక్షకుల ఆదరణ దొరకడం కష్టమైన తరుణంలో కార్తికేయ చేయాల్సింది ఇలాంటి ప్రయత్నాలే. ఐశ్యర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న భజే వాయు వేగంకు రదన్ పాటలు, కపిల్ బీజీఎమ్ సమకూరుస్తున్నారు.
This post was last modified on April 20, 2024 4:23 pm
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…