నిన్న విడుదలైన చిన్న సినిమాలను ఆడియన్స్ పెద్దగా పట్టించుకోలేదు కానీ ఏవో ఒకటి కొత్తవి వస్తే ప్రతి శుక్రవారం థియేటర్ కు వెళ్లి చూడాలనుకునే బ్యాచ్ ఎంతో కొంత ఉండక పోరు. పారిజాత పర్వం తర్వాత కొంత జనాల దృష్టి పడేలా టీమ్ ప్రమోషన్ చేసిన మూవీ టెనెంట్. ఇంగ్లీష్ పేరు పెట్టి ఏదో వెరైటీ అనుకున్నారు కానీ నిజానికి పబ్లిక్ కి రీచ్ కాకపోవడంలో ఇది కూడా ఒకరకంగా దోహదం చేసిందని చెప్పాలి. మా ఊరి పొలిమేర 2 సూపర్ హిట్ తర్వాత సత్యం రాజేష్ కొచ్చిన ఇమేజ్ దృష్ట్యా అతనే ప్రధాన పాత్ర పోషించిన టెనెంట్ కు మంచి రెస్పాన్స్ ఉంటుందని నిర్మాతలు భావించారు.
సత్యం రాజేష్ సైతం కనెక్ట్ అవుతుందేమోనని ఎదురు చూశాడు. తీరా చూస్తే కంటెంట్ ప్లస్ రెస్పాన్స్ పరంగా రెండింట్లోనూ టెనెంట్ నిరాశపరిచేలానే ఉంది. కథేంటో చూద్దాం. గౌతమ్(సత్యం రాజేష్), సంధ్య(మేఘ చౌదరి) దంపతులు. ఖరీదైన అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ తీసుకుని సంతోషంగా ఉంటారు. అమెరికా వెళ్లే ప్లాన్ లో ఉండగా అనూహ్యంగా సంధ్య హత్యకు గురవుతుంది. అదే సమయంలో ఓ యువకుడు (భరత్ కాంత్) సూసైడ్ చేసుకుంటాడు. లేడీ ఆఫీసర్(ఎస్తర్)విచారణకు వస్తుంది. హత్యా నేరం మీద పడ్డ గౌతమ్ ఈ కేసు నుంచి ఎలా బయటపడ్డాడనేది అసలు సస్పెన్స్ పాయింట్.
కేవలం 1 గంట 36 నిమిషాల నిడివి ఉన్న టెనెంట్ చాలా తక్కువ సమయంలోనూ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే లేక ఆసక్తికరంగా సాగదు. భార్య హత్య చుట్టూ గతంలో బోలెడు సినిమాలు వచ్చినప్పటికి ఇందులో దర్శకుడు యుగంధర్ తీసుకున్న బ్యాక్ డ్రాప్ కొంచెం కొత్తగా, మెసేజ్ టచ్ తో ఆలోచించేదిగా ఉన్నప్పటికీ సరైన రీతిలో కథా కథనాలు లేకపోవడంతో ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ దాకా కథ ఎటు పోతుందో అర్థం కాదు. బలం లేని సన్నివేశాల వల్ల థ్రిల్ ఫ్యాక్టర్ పూర్తిగా దెబ్బ తింది. లెన్త్ పరంగా చూస్తే ఓటిటి కోసం తీసింది థియేటర్లకు వదిలినట్టు ఉన్నారు . పుణ్యం పురుషార్థం రెండూ దక్కలేదు.
This post was last modified on April 20, 2024 3:27 pm
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…