పెద్దగా అంచనాలు లేకుండా విడుదలై ఈ ఏడాది మళయాలం టాప్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా పేరు తెచ్చుకుంది ప్రేమలు. తెలుగు డబ్బింగ్ సైతం 17 కోట్లకు పైగా వసూళ్లతో మంచి విజయం అందుకుంది. పరిచయమే లేని క్యాస్టింగ్ తో, హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ ని వాడుకుని దర్శకుడు గిరీష్ ఏడి చేసిన మేజిక్ యూత్ కి ఓ రేంజ్ లో ఎక్కేసింది. ఇప్పుడు దీనికి సీక్వెల్ ప్రకటించారు. ప్రేమలు 2 పేరుతో వచ్చే సంవత్సరం రిలీజవుతుందని చిన్న ప్రీ లుక్ లాంటి పోస్టర్ తో అఫీషియల్ చేశారు. టాలీవుడ్ అనువాదం తిరిగి ఎస్ఎస్ కార్తికేయనే అందించబోతున్నాడు.
మాములుగా ప్రేమకథలకు కొనసాగింపు పెద్ద ఛాలెంజ్. అందుకే వీటి జోలికి వెళ్లేందుకు అంతగా సాహసించరు. బాహుబలి, కెజిఎఫ్, పుష్ప లాంటివి లార్జర్ థాన్ లైఫ్ స్టోరీలు కాబట్టి ఎంత చూపించినా ప్రేక్షకులు అంగీకరించే అవకాశం ఉంటుంది. కానీ లవ్ స్టోరీస్ కి ఆ ఛాన్స్ ఉండదు. అందుకే నువ్వే కావాలి, నువ్వు నేను, చిత్రం, ఆనందం, జయం, గీతాంజలి, బొమ్మరిల్లు, ప్రేమ దేశం లాంటి వాటికి కొనసాగింపులు రాలేదు. ఆయా దర్శక నిర్మాతలు ప్రయత్నించినా ఒరిజినల్ ని మ్యాచ్ చేయలేమని ఆ ఆలోచన వదులుకున్నారు. కానీ ప్రేమలు మాత్రం రిస్క్ కు రెడీ అంటోంది.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఈసారి ప్రేమలు 2 హైదరాబాద్ నుంచి వేరే ఊరికి షిఫ్ట్ కాబోతోంది. మొదటి భాగంలో కనికట్టు చేసిన మమిత బైజుతో పాటు ఇతర క్యాస్టింగ్ ఎంత మంది రిపీట్ అవుతారో చెప్పలేం. భారీ మార్పులతో ఫ్రెష్ స్టోరీ చెబుతారని వినికిడి. కేవలం టైటిల్ బ్రాండ్ ని మాత్రమే వాడుకుని అంతకు మించిన ఫన్, యూత్ ఫుల్ ఎలిమెంట్స్ తో ప్రేమలు 2 తీస్తారని తెలిసింది. ఇంతకు మించి ప్రస్తుతానికి వివరాలు లేవు. ఒకవేళ ఈ సీక్వెల్ కనక బ్లాక్ బస్టర్ అయితే మాత్రం ఇతర దర్శకులు స్ఫూర్తి చెంది హిట్టయిన ప్రేమకథలుకు పార్ట్ 2లు సిద్ధం చేస్తారు. చూడాలి ఏం చేస్తుందో.
This post was last modified on April 19, 2024 11:33 pm
సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…
అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…
ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…
ఇండియాలో వివిధ భాషల్లో అనేక టాక్ షోలు ఉన్నాయి. అందులో అత్యంత పాపులర్ ఏది అంటే బాలీవుడ్ దర్శక నిర్మాత…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…