Movie News

బాలయ్య 109 టార్గెట్ సంక్రాంతి కాదు

బాలకృష్ణ దర్శకుడు బాబీ కలయికలో రూపొందుతున్న సినిమాకు ఎన్నికల కోసం బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వచ్చే నెల పదమూడు వరకు హీరో పాల్గొనే అవకాశం లేకపోవడంతో టీమ్ పూర్తయిన భాగానికి పోస్ట్ ప్రొడక్షన్ తో పాటు తదుపరి షెడ్యూల్స్ కి సంబంధించిన పనులను ప్లాన్ చేసుకోవడంలో బిజీగా ఉంది. కొంత లేట్ అయినా పర్వాలేదు అభిమానులు 2025 సంక్రాంతి బరిలో ఉండాలని కోరుకుంటున్నారు. పండగ సెంటిమెంట్ ని మరోసారి వాడుకుంటూ బ్లాక్ బస్టర్ కొట్టొచ్చని ఆశ పడుతున్నారు. అయితే బాలయ్య 109 టార్గెట్ సంక్రాంతి కావడం లేదు.

ఎందుకంటే ఎలక్షన్లు పూర్తవ్వగానే వీలైనంత వేగంగా షూట్ చేసేలా బాబీ రెడీ అవుతున్నాడు. గత ఏడాది భగవంత్ కేసరి తరహాలో దసరాకు రిలీజ్ చేసే ఆలోచనలో సితార ఎంటర్ టైన్మెంట్స్ టీమ్ ఉందని ఇన్ సైడ్ టాక్. మరో బలమైన కారణం కూడా ఇక్కడ చెప్పుకోవాలి. ఇదే సంస్థ నుంచి వచ్చే సంవత్సరం సంక్రాంతికి రవితేజ – భాను భోగవరపు కాంబో మూవీని ఆల్రెడీ లాక్ చేశారు. ప్రాజెక్టు అనౌన్స్ మెంట్ రోజే రిలీజ్ గురించి స్పష్టంగా పేర్కొన్నారు. అంటే బాలయ్యది అంత ఆలస్యం కాదనే నమ్మకంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాకపోతే తేదీ ఎప్పుడనేది కొంత కాలం సస్పెన్సే.

ఆగస్ట్ నుంచి డిసెంబర్ దాకా నెలకు రెండు మూడు క్రేజీ చిత్రాలు ఆల్రెడీ డేట్లను బ్లాక్ చేసుకుని ప్రకటనలు ఇచ్చాయి. మరికొన్ని పరిస్థితులను బేరీజు వేసుకుని అనౌన్స్ మెంట్ కు రెడీ అవుతున్నాయి. ఓజి, దేవర, పుష్ప 2, భారతీయుడు 2, కంగువా, సరిపోదా శనివారం, గేమ్ ఛేంజర్ తదితరాలన్నీ క్యూ కట్టి ఉన్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకుంటూనే బాలయ్య 109కి బెస్ట్ డేట్ పట్టాలి. ఒకవేళ అనూహ్యంగా ఏదైనా జరిగి జనవరికి కర్చీఫ్ వేసిన రవితేజ తప్పుకుంటే అప్పుడు బాలకృష్ణ చిరంజీవిల పోటీని మరోసారి చూడొచ్చు. కానీ ఆ క్లాష్ ఈసారి ఉండకపోవచ్చు.

This post was last modified on April 19, 2024 6:38 pm

Share

Recent Posts

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

5 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

7 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

8 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

8 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

8 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

8 hours ago