దగ్గుబాటి రానా తొలి సినిమాగా లీడర్ కు అభిమానుల్లో ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. బాక్సాఫీస్ వద్ద కళ్ళు చెదిరే కనక వర్షం కురిపించకపోయినా డీసెంట్ రన్ తో మంచి విజయన్నే నమోదు చేసుకుంది. థియేటర్లలో కన్నా హోమ్ వీడియోగా సిడిలు, శాటిలైట్ ఛానల్స్ లో వచ్చాక విపరీతమైన ఆదరణ దక్కింది. 2010లో రిలీజైన లీడర్ వచ్చే ఏడాది 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. గత కొన్నేళ్లుగా దీనికి సీక్వెల్ కావాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తూనే ఉన్నారు. దర్శకుడు శేఖర్ కమ్ముల ఆ మధ్య దాటవేస్తూ వచ్చారు కానీ హ్యాపీ డేస్ రీ రిలీజ్ సందర్భంగా దాని గురించి ఓపెనయ్యారు.
తన కెరీర్ లోనే లీడర్ అత్యంత ప్రత్యేక సినిమా అని, అప్పట్లో లక్ష కోట్ల అవినీతి అంటే చాలా మంది నమ్మలేనట్టుగా చూశారని, కానీ ఇప్పుడదే మాములు విషయంగా మారిపోయిందని, ఇంకా చెప్పాలంటే అంతకంటే దారుణంగా వర్తమాన రాజకీయాలు కుళ్లిపోయాయని అన్నారు. లీడర్ 2 గురించి ఒక పాయింట్ మనసులో ఉందని, స్క్రిప్ట్ సిద్ధమైతే సరైన సమయంలోనే అది కూడా రానాతోనే తీసేందుకు ఇష్టపడతానని క్లారిటీ ఇచ్చారు. ఇతర హీరోతో చేసే సమస్యే లేదని, స్పెషల్ మూవీగా నిలిచిన లీడర్ లో ఇంకో కథానాయకుడిని ఊహించుకోలేనని కుండబద్దలు కొట్టేశారు.
సో అభిమానులు లీడర్ 2 గురించి నమ్మకంగా ఎదురు చూడొచ్చు. రానా తర్వాత ఎన్ని సినిమాలు చేసినా కెరీర్ పరంగా మరీ పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. బాహుబలితో అంతర్జాతీయ గుర్తింపు వచ్చినా అందులో చేసింది విలన్ పాత్ర కావడం వల్ల మార్కెట్ పరంగా సోలో హీరోగా పరిమితులు ఏర్పడ్డాయి. భీమ్లా నాయక్ లోనూ సపోర్టింగ్ రోల్ చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో తేజతో రాక్షస రాజు చేస్తున్న రానా కనక వీలైనంత త్వరగా లీడర్ 2ని శేఖర్ కమ్ములతో చేతులు కలిపితే ఈసారి మరింత పెద్ద బ్రేక్ దక్కొచ్చు. వివాదం లేకుండా ఇప్పటి పొలిటికల్ స్టోరీలు రాసుకోవడం కష్టమే
This post was last modified on April 19, 2024 11:20 am
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…
తెలంగాణ అసెంబ్లీలో టాలీవుడ్ కు సంబంధించి ఎప్పుడూ జరగనంత వాడి వేడి చర్చ ఇవాళ కనిపించడం ఇండస్ట్రీ వర్గాలనే కాదు…
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్.. ఇటు బీజేపీకి, అటు హిందూ సంఘాలకు కూడా.. ఐకాన్. ఆయన…