నటుడిగా గొప్ప పేరు, దాంతో పాటే సూపర్ స్టార్ ఇమేజ్ ఉణ్న వాళ్లు అరుదుగా ఉంటారు. విక్రమ్ ఈ కోవకే చెందుతాడు. సేతు, పితామగన్ (శివపుత్రుడు), సామి, అన్నియన్ (అపరిచితుడు) లాంటి బ్లాక్‌బస్టర్లతో ఒకప్పుడు సౌత్ ఇండియాలో అతడి పేరు మార్మోగిపోయింది. ఇక్కడి టాప్ స్టార్లకు అతణ్ని చూస్తే అసూయ పుట్టే పరిస్థితి. కానీ ఆ తర్వాత భారీ అంచనాల మధ్య వచ్చిన అతడి సినిమాలేవీ ఆశించిన విజయం సాధించలేకపోయాయి. గత రెండు దశాబ్దాలుగా సోలో హీరోగా విక్రమ్‌కు నిఖార్సయిన హిట్టే లేదు. అయినా అతడి నుంచి పెద్ద పెద్ద సినిమాలు వస్తూనే ఉంటాయి.
కబాలి దర్శకుడు పా.రంజిత్‌తో విక్రమ్ ‘తంగలాన్’ అనే ఎపిక్ మూవీ చేస్తున్నాడు. కానీ దాని రిలీజ్ వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. పైగా అందులో విక్రమ్ అవతారం అదీ చూస్తే ఆ మూవీ కమర్షియల్‌గా ఆడుతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
కానీ విక్రమ్ చేస్తున్న మరో సినిమా మాత్రం చాలా ప్రామిసింగ్‌గా, ఎగ్జైటింగ్‌గా కనిపిస్తోంది. సిద్దార్థ్‌తో ‘చిత్తా’ (తెలుగులో చిన్నా) అనే హిట్ మూవీ తీసిన అరుణ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ టైంలో రిలీజ్ చేసిన టీజర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. తాజాగా విక్రమ్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఇంకో టీజర్ వదిలారు. అది ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. విక్రమ్ ఈ చిత్రంలో కిరాణా కొట్టు నడిపే మధ్య తరగతి వ్యక్తిగా కనిపిస్తున్నాడు. ఇలాంటి పాత్రతో హీరోయిజం ఎలా పండించడం అనిపిస్తుంది కానీ.. టీజర్ చూస్తే మాత్రం హీరోయిజం వేరే లెవెల్లో ఉంటుందని అర్థమవుతోంది.
హీరో చేతిలో దెబ్బలు తిన్న ఒక గ్యాంగ్.. అతడి కిరాణా కొట్టు ముందు కాపు కాయడం.. వీళ్ల రాకను గుర్తించి హీరో కొట్టులో అక్కడక్కడా పెట్టిన మారణాయుధాల్ని రెడీ చేసుకోవడం.. ఓవైపు తన వ్యాపారం సాగిస్తూనే విలన్లకు ధమ్కీ ఇస్తూ ముగిసిన టీజర్ అదిరిపోయిందనే చెప్పాలి. విక్రమ్‌కు చాన్నాళ్ల తర్వాత ఓ మాస్ హిట్ పడేలా ఉంది ప్రోమోలు చూస్తుంటే. ‘వీర ధీర సూరన్’ అనే టైటిల్‌తో రానున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తుండడం విశేషం.
This post was last modified on April 18, 2024 2:37 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…