కొన్ని చిన్న సినిమాలు ఊహించని అద్భుతాలు చేస్తాయి. విడుదలకు ముందు వరకు వాటి మీద ఎలాంటి అంచనాలు ఉండవు. దర్శకుడి కట్టుకున్న భార్యే ఎందుకొచ్చిన తంటా ఓటిటికి అమ్మేయమని సలహా ఇస్తుంది. ఇలాంటి అవరోధాలు దాటుకుని గత ఏడాది సంచలనం సృష్టించిన మూవీ 12త్ ఫెయిల్. డిజిటల్ లో నటుడిగా ఎదుగుతున్న విక్రాంత్ మాస్సేని ఒక్కసారిగా గుర్తింపు వచ్చిన స్టార్ గా చేసిన సంచలనమిది. కోల్పోయిన ఫామ్ ని తిరిగి తెచ్చుకునేలా దర్శకుడు విధు వినోద్ చోప్రాకు కొత్త ఇన్నింగ్స్ ని అందించింది. ఇంత బ్లాక్ బస్టర్ త్వరలో చైనాలో విడుదల కాబోతోంది.
ఏదో ఆషామాషీ రిలీజ్ అయితే ఈ వార్తే అవసరం లేదు. ఏకంగా 20 వేల థియేటర్లలో దేశవ్యాప్తంగా విడుదల చేయనుండటంతో యూనిట్ ఆనందం అంతా ఇంతా కాదు. మాములుగా చైనాలో మన ఎమోషనల్ డ్రామాలు విపరీతంగా ఆడతాయి. అమీర్ ఖాన్ గెస్టుగా నటించిన సీక్రెట్ సూపర్ స్టార్ మన దగ్గర జస్ట్ హిట్ అనిపించుకుంటే చైనాలో ఏకంగా రికార్డులు తిరగరాసింది. ఇలాంటి ఉదాహరణలు బోలెడున్నాయి. ప్రమోషన్లు చేసుకోవడం కోసం 12త్ ఫెయిల్ టీమ్ ప్రత్యేకంగా చైనా వెళ్లబోతోంది. ఇండియా లాగే అక్కడ కూడా సెన్సేషనల్ సక్సెస్ ఖాయమనే ధీమా హీరో దర్శకుడిలో కనిపిస్తోంది.
ఏమైనా ఈ 12త్ ఫెయిల్ విజయం ఒక కేస్ స్టడీ లాంటిది. కేవలం గ్రాండియర్లు, విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉన్న సినిమాలనే జనం థియేటర్లలో చూసేందుకు ఇష్టపడతున్నారన్న కామెంట్లను నిలువునా బద్దలు కొట్టి స్ఫూర్తిగా నిలిచింది. హాట్ స్టార్ ఓటిటిలో వచ్చాక మిలియన్ల వ్యూస్ వెల్లువలా తెచ్చుకుంది. తెలుగుతో సహా ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంచడం రీచ్ ని పెంచింది. మన దగ్గర బలగం లాంటివి అనూహ్య విజయాలు సాధిస్తే బాలీవుడ్ లో 12త్ ఫెయిల్ లాంటివి ఆదర్శంగా నిలుస్తున్నాయి. వందల కోట్ల బడ్జెట్ కన్నా కంటెంట్ ముఖ్యమని పదే పదే చాటుతున్నాయి.
This post was last modified on April 17, 2024 9:28 pm
రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుడు ఇండియన్ సినిమాలోనే ఒక ట్రెండ్ సెట్టర్. శివ, రంగీలా, సత్య, కంపెనీ, సర్కార్…
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…