రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్‍లకు నార్కొటిక్స్ బ్యూరో నుంచి సమన్లు అందాయనే వార్తలు రావడం, అప్పుడు వాళ్లిద్దరి పేర్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవడం, ఆ తర్వాత వాళ్లకు సమన్లు ఇవ్వలేదని ఎన్‍సిబి పేర్కొనడం, అటుపై సారీ సారా, సారీ రకుల్ అంటూ సెలబ్రిటీలతో సహా అందరూ పోస్టులు వేయడం ఇదంతా తెలిసే వుంటుంది. అయితే తమ గురించి ఇంత జరుగుతోన్నా ఆ ఇద్దరూ మాత్రం పెదవి విప్పలేదు.
తాజాగా ఇండియా టుడేతో నార్కొటిక్స్ బ్యూరో డైరెక్టర్ మాట్లాడుతూ విచారణలో రియా వాళ్ల పేర్లు చెప్పిందని అంగీకరించారు. సారా, రకుల్ ఇద్దరూ సుషాంత్ ఇచ్చిన పార్టీలకు అటెండ్ అయినట్టు రియా చెప్పిందట. వాళ్ల పేర్లు విచారణలో వచ్చినా కానీ వాళ్లకు సమన్లు అయితే ఇవ్వలేదని, అలా అని వాళ్లను పిలిచే అవకాశం లేదని చెప్పలేమని ఆయన ఇండియా టుడేతో అన్నారు.
దీనిని బట్టి విచారణలో వచ్చిన పేర్ల జాబితా మాత్రం తయారు చేస్తున్నారని, ఇంకా విచారణ మాత్రమే జరపలేదని అర్థమవుతోంది. ఇప్పుడు రకుల్, సారా ఎందుకు మౌనంగా ఉన్నారనేది అర్థమవుతోందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. నిజంగా వాళ్లను విచారణకు పిలిపిస్తే మాత్రం ఈ సారీ ట్రెండ్లలో పాల్గొన్న సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో ట్రోలింగ్ తాకిడి తప్పదు.
This post was last modified on September 16, 2020 2:21 am
జనసేన ఆవిర్భావ సభా వేదిక మీద నుంచి ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చాలా విషయాలను ప్రస్తావించారు. కొన్ని…
మూడు వారాలు ఆలస్యంగా విడుదలైనా మంచి వసూళ్లతో తెలుగు వెర్షన్ బోణీ మొదలుపెట్టిన ఛావాకు వసూళ్లు బాగానే నమోదవుతున్నా ఏదో…
సౌత్ ఇండియన్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా పేరొందిన లోకేష్ కనగరాజ్ కు మర్చిపోలేని బ్రేక్ ఇచ్చింది ఖైదీ. తెలుగులో…
జనసేన ఆవిర్భావ వేడుకల్లో సుదీర్ఘ ప్రసంగం చేసిన ఆ పార్టీ అదినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్… తనను…
భయం లేదు కాబట్టే… దుష్ట పాలనను బద్దలు కొట్టామని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.…
భారత దేశానికి బహుభాషే మంచిదని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తాజాగా పిఠాపురంలో జరిగిన…