టాలీవుడ్లో ఒకప్పుడు బిజీయెస్ట్ హీరోయిన్లలో రాశి ఖన్నా ఒకరు. కథానాయికగా తొలి చిత్రం ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంలో క్యూట్ లుక్స్‌తో కట్టిపడేసిన ఈ ఢిల్లీ భామ.. ఆ తర్వాత బెంగాల్ టైగర్, తొలి ప్రేమ, ప్రతి రోజు పండగే.. ఇలా మిడ్ రేంజ్ సినిమాలతో మంచి ఊపు మీదే కనిపించింది. ఇదే ఊపులో తన కెరీర్ ఇంకో లెవెల్‌కు వెళ్తుందనుకుంటే.. వరుస ఫ్లాపులు ఆమెను వెనక్కి లాగేశాయి. వరల్డ్ ఫేమస్ లవర్, పక్కా కమర్షియల్, థ్యాంక్యూ.. ఇలా వరుసగా డిజాస్టర్లు పడడంతో రాశి కెరీర్ గాడి తప్పింది.
థ్యాంక్యూ తర్వాత ఏడాది పాటు తెలుగులో రాశికి ఛాన్సులే లేవు. ఆ టైంలోనే ఆమె బాలీవుడ్, కోలీవుడ్ మీద దృష్టిపెట్టింది. నెమ్మదిగా తెలుగు చిత్రాలకు దూరం కావడంతో ఇక ఇక్కడ ఆమె కెరీర్ ముగిసినట్లే అనుకున్నారంతా. కానీ కొంచెం గ్యాప్ తర్వాత రాశి మళ్లీ తెలుగులో బిజీ అవుతోంది.
ఆల్రెడీ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ సరసన ‘తెలుసు కదా’ చిత్రంలో ఓ కథానాయికగా నటిస్తోంది రాశి ఖన్నా. నీరజ కోన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. టిల్ల స్క్వేర్ తర్వాత సిద్ధు నుంచి రాబోతున్న సినిమా కావడంతో దీనికి మంచి హైప్ ఉంటుందనడంలో సందేహం లేదు. ఇలాంటి సినిమాతో రీఎంట్రీ అంటే రాశికి ప్లస్సే. ఈ సినిమా చేస్తూనే ఇప్పుడు ఇంకో క్రేజీ ప్రాజెక్టులో అవకాశం దక్కించుకుంది రాశి.
నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్లో ‘భీష్మ’ తర్వాత రాబోతున్న ‘రాబిన్ హుడ్’లో తాజాగా ఛాన్స్ అందుకుందట రాశి. ఈ చిత్రానికి ముందు రష్మిక మందన్నాను కథానాయికగా అనుకున్నారు. కానీ తర్వాత తన స్థానంలోకి శ్రీ లీల వచ్చింది. ఈ చిత్రంలో ఇంకో ప్రత్యేకమైన పాత్రలో రాశి నటిస్తోందన్నది తాజా సమాచారం. ఈ రెండు చిత్రాలు వర్కవుట్ అయితే రాశి మళ్లీ టాలీవుడ్లో బిజీ అవ్వడానికి ఛాన్సుంది.
This post was last modified on April 16, 2024 2:43 pm
టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…
ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…
ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…
టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…
పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…