Movie News

అమ్మాయి కోసం ఊర మాస్ ‘రత్నం’

హిట్ల కంటే ఫ్లాపులు ఎక్కువనే సంగతి పక్కనపెడితే విశాల్ కు తెలుగులో మంచి మాస్ ఇమేజ్ ఉంది. పందెం కోడితో సూపర్ హిట్ అందుకున్న తర్వాత కొన్ని వరస సినిమాలు కమర్షియల్ గా సాధించిన విజయాలు ఇమేజ్ ని పెంచాయి. అటుపై కథల ఎంపికలో చేసిన పొరపాట్ల వల్ల పడ్డ డిజాస్టర్లు డబ్బింగ్ మార్కెట్ ని దెబ్బ కొట్టాయి. గోపీచంద్ లాగా సరైన కంటెంట్ కోసం ఎదురు చూస్తున్న విశాల్ త్వరలో రత్నంగా రాబోతున్నాడు. సామీ, సింగం సిరీస్ తో బాగా పాపులరైన హరి ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కు దర్శకుడు. ఏప్రిల్ 26 థియేటర్లలో అడుగు పెడుతున్నాడు.

ట్రైలర్ చూస్తే విశాల్ ఈసారి ఎలాంటి రిస్క్ తీసుకోకుండా మళ్ళీ పాత స్కూలుకు వెళ్ళిపోయాడు. రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండే గ్రామాలు, వాటి పెద్దల మధ్య ఉండే పగలు, అవతలి వర్గానికి చెందిన అమ్మాయిని ప్రేమించి ఆమె కోసం ఊచకోత కోస్తూ ఎంత దూరమైనా వెళ్లే యువకుడిగా రత్నం ఇలా మొత్తం సెటప్ ఒక ఫార్ములా ప్రకారం జరిగిపోయింది. బద్దశత్రువులుగా సముతిరఖని, మురళీశర్మలు కనిపించగా హీరోయిన్ గా ప్రియా భవాని శంకర్ నటించింది. విజువల్స్ గట్రా చూస్తుంటే దం బిర్యానీ లాంటి మహేష్ బాబు ఒక్కడుని అరవ సాంబార్ కలిపి వడ్డించినట్టు ఉంది.

దేవిశ్రీప్రసాద్ సంగీతం ఎందుకో డిఫరెంట్ గా అనిపించలేదు. సీన్లను ఎలివేట్ చేసిన ఫీలింగ్ కలగలేదు. విశాల్ పాత్ర మాస్ టచ్ తో గతంలో చూసినట్టే ఉంది. హరి మాత్రం సినిమా ఖచ్చితంగా అన్ని వర్గాలను మెప్పిస్తుందనే ధీమాలో ఉన్నారు. ఇంకా పది రోజులు టైం ఉంది కాబట్టి ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చి ప్రమోషన్లలో పాల్గొనేందుకు విశాల్ ప్లాన్ చేసుకుంటున్నాడు. అదే రోజు తమన్నా – రాశిఖన్నాల బాక్ రిలీజవుతోంది. ముందురోజు నారా రోహిత్ ప్రతినిధి 2 ఉంది. సో ఎక్కువ పోటీలేని టైంలో ఇలాంటి మాస్ బొమ్మతో ఈసారైనా విశాల్ కంబ్యాక్ ఇస్తాడో లేదో చూడాలి.

Share

Recent Posts

ట్విస్ట్…. నారాయణమ్మకు మూలం నవనీతమ్మ ?

నిన్న ఆదర్శ కుటుంబం ఏకె 47 నుంచి విడుదలైన నారాయణమ్మ పాట సోషల్ మీడియాలో డిస్కషన్ కు దారి తీస్తోంది.…

3 minutes ago

రిక్షా తోలుకోమంటున్న డిప్యూటీ సీఎం…

ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న యువతకు ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ చేసిన సూచన ఇప్పుడు వైరల్ అవుతోంది. ఉద్యోగం…

50 minutes ago

ఆ రోడ్డుపై వైసీపీ దుష్ప్రచారం.. ఖండించిన డిప్యూటీ సీఎంవో

ఈ రోజుల్లో మంచి పని చేయడం ఎంత ముఖ్యమో...ఆ పనిపై జరిగే విషప్రచారాన్ని ఖండించడం కూడా అంతే ముఖ్యం. మరీ…

1 hour ago

చీకట్లో మొబైల్‌ చూస్తున్నారా.. ఈ డేంజర్‌ గురించి తెలుసుకోండి..

రాత్రి నిద్రపోయే ముందు ఫోన్‌ చూడటం చాలామందికి అలవాటుగా మారిపోయింది. గదిలో లైట్లు ఆపేసిన తర్వాత కూడా మొబైల్‌ స్క్రీన్‌…

2 hours ago

వెంకీ త్రివిక్రమ్ సినిమా స్థాయి బజ్ ఉందా?

సరిగ్గా ఇంకో పదకొండు రోజుల్లో ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల కానుంది. సంక్రాంతికి వస్తున్నాం లాంటి మూడు వందల…

3 hours ago

పబ్లిక్ టాయిలెట్‌లో ఇద్దరు యువకులు మృతి… ఏం జరిగింది?

ముంబైలోని గోరేగావ్‌లో పబ్లిక్ టాయిలెట్‌కు వెళ్లిన ఇద్దరు యువకులు అక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒకేసారి ఇద్దరు చనిపోవడంతో అసలు లోపల…

3 hours ago