Movie News

ప్రతినిధి 2 భలే ఛాన్స్ పట్టాడు

టాలెంట్ ఎంతున్నా సక్సెస్ అందుకోవడంలో వెనుకబడ్డ నారా రోహిత్ హీరోగా రూపొందిన ప్రతినిధి 2 ఇంకో పది రోజుల్లో విడుదల కానుంది. ఏప్రిల్ 25 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. టిల్లు స్క్వేర్ తర్వాత బాక్సాఫీసుకి కిక్ ఇచ్చిన సినిమా మరొకటి రాకపోవడంతో థియేటర్ల ఫీడింగ్ చాలా కష్టంగా మారింది. మంజుమ్మల్ బాయ్స్ మినహాయించి ది ఫ్యామిలీ స్టార్, గీతాంజలి మళ్ళీ వచ్చింది. లవ్ గురు, డియర్ తో సహా వరసగా రెండు వారాలు ట్రేడ్ ని నిరాశలో ముంచెత్తాయి. ఈ శుక్రవారం సైతం చెప్పుకోదగ్గ క్రేజీ రిలీజు ఏదీ లేదు.

మందు ప్రకటించిన ప్రకారమైతే ఏప్రిల్ 25 దిల్ రాజు సమర్పణలో లవ్ మీ ఇఫ్ యు డేర్ రావాల్సింది. కానీ ప్రమోషన్లకు టైం లేకపోవడంతో పాటు ఇతరత్రా కారణాల వల్ల వాయిదా పడిందని సమాచారం. సో దానికోసం ముందస్తుగా లాక్ చేసుకోవాలనుకున్న థియేటర్లు ఖాళీ అవుతాయి. వాటిని ప్రతినిధి 2 కోసం వాడుకోవచ్చు. మరుసటి రోజు విశాల్ డబ్బింగ్ మూవీ రత్నంతో పాటు తమన్నా, రాశిఖన్నాల బాక్ ఉన్నాయి. కమర్షియల్ గా ఇవి మాస్ ని టార్గెట్ చేసుకున్నవే అయినా అనువాదాలు కాబట్టి ఫ్యామిలీ, న్యూట్రల్ ఆడియన్స్ ని రప్పించడం అంత సులభంగా ఉండదు.

ఇదంతా ప్రతినిధి 2కి సానుకూలంగా పనిచేసేదే. టీవీ5 మూర్తి మొదటిసారి దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ మీద టీజర్ వచ్చాక అంచనాలు మొదలయ్యాయి. ఈ మధ్య వచ్చిన పొలిటికల్ అజెండా సినిమాల్లా కాకుండా వర్తమాన రాజకీయాలను స్పృశిస్తూనే సీరియస్ గా నెరేట్ చేసిన విధానం కనెక్ట్ అయ్యేలానే ఉంది. లుక్స్, ఫిజిక్ పరంగా కూడా నారా రోహిత్ మంచి మేకోవర్ చూపిస్తున్నాడు. కాకపోతే సెన్సార్ ఇబ్బందులు ఏవీ తలెత్తకపోతేనే ప్రతినిధి 2కి రూట్ క్లియర్ గా ఉంటుంది. రిలీజ్ డేట్ కి ఎన్నికలకు మధ్య కేవలం ఇరవై రోజుల గ్యాప్ ఉన్న నేపథ్యంలో ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.

This post was last modified on April 15, 2024 11:51 am

Share
Show comments
Published by
Satya
Tags: Pratinidhi 2

Recent Posts

ముందస్తు బెయిల్ నాకు వద్దు: చెవిరెడ్డి

వైసీపీ కీలక నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఓ రేంజిలో న్యాయ పోరాటం చేస్తున్నారు. తిరుపతి…

11 hours ago

రిటైర్మెంట్ ప్రకటించిన మరో టీమిండియా బౌలర్

రీసెంట్ గా స్పిన్నర్ అశ్విన్ టీమిండియాకు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరో బౌలర్ కూడా…

12 hours ago

జ‌గ‌న్ వ్య‌వ‌హారంపై రాజ‌కీయ ర‌చ్చ‌.. ఎందుకీ ఆరాటం?!

వైసీపీ అధినేత జ‌గ‌న్ వ్య‌వ‌హార శైలి కేవలం ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కోస‌మే ఆరాట‌ప‌డుతున్న‌ట్టు క‌నిపిస్తోందని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌స్తుతం ఆయ‌న‌కు…

12 hours ago

ఆరో ‘ఆట’ రద్దు.. ఏపీలో ఇకపై 5 ‘ఆట’లే

ఏపీలో రిలీజ్ సినిమాల ప్రదర్శనలపై కూటమి సర్కారు సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇప్పటిదాకా రిలీజ్ అయ్యే దాదాపుగా అన్ని…

13 hours ago

గ్రామాల్లోనే టెంట్లు… వాటిలోనే పవన్ బస

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏది చేసినా చాలా వెరైటీగా ఉంటుంది. ఇతర రాజకీయ నాయకులతో…

13 hours ago

డాకు మహారాజ్ చాలానే దాచి పెట్టాడు

https://www.youtube.com/watch?v=V0ARlFc_ndE సంక్రాంతి పందెం కోళ్ళలో మొదటిది గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. తుది తీర్పు ఏంటనేది తేలడానికి ఇంకొంచెం…

14 hours ago