దేశంలో అత్యధికంగా సినిమా వాళ్లు రాజకీయాల్లోకి వచ్చిన రాష్ట్రం ఏది అంటే మరో మాట లేకుండా తమిళనాడు అని చెప్పేయొచ్చు. తెలుగు నాట కూడా చాలామంది సినిమా వాళ్లు రాజకీయారంగేట్రం చేశార కానీ.. తమిళనాడు స్థాయిలో మాత్రం కాదు. అక్కడ ఇప్పటికే పదుల సంఖ్యలో సినిమా వాళ్లు రాజకీయాల్లో అదృష్టం పరీక్షించుకున్నారు. తమిళనాడును అత్యధిక కాలం పాలించింది కూడా సినిమా వాళ్లే. త్వరలోనే విజయ్ సైతం రాజకీయాల్లోకి రానున్నట్లు ప్రకటించాడు.
మరోవైపు తెలుగువాడైన తమిళ స్టార్ హీరో విశాల్ రాజకీయ ప్రవేశం గురించి ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. తనకు ఆ ఆసక్తి ఉన్నట్లు చెబుతున్నాడు కానీ.. ఎప్పుడు ఎంట్రీ ఇచ్చేది మాత్రం తేల్చట్లేదు. ఐతే ఎట్టకేలకు విశాల్ ఈ విషయంలో ఒక ప్రకటన చేశాడు.
తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు జరిగే 2024లో తాను రాజకీయ రంగప్రవేశం చేయబోతున్నట్లు విశాల్ ప్రకటించాడు. ఐతే ఆ ఎన్నికల్లో కేవలం ఎమ్మెల్యేగా పోటీ చేయడం కాదు.. రాజకీయ పార్టీనే పెట్టబోతున్నట్లు విశాల్ వెల్లడించడం విశేషం. ‘‘త్వరలోనే రాజకీయాల్లోకి వస్తున్నా. పార్టీని స్థాపించి 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నా. ప్రస్తుతం ప్రజలకు సరైన వసతులు లేవు. వాళ్లకు సేవ చేసి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలన్నది నా ఉద్దేశం. అందుకే రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నా’’ అని విశాల్ ప్రకటించాడు.
మరి ఏ రాజకీయ పార్టీతో అయినా పొత్తు పెట్టుకుంటారా అని విశాల్‌ను అడిగితే.. అలాంటిదేమీ లేదని.. ముందు తనను తాను నిరూపించుకున్న తర్ావతే మిగతా విషయాలు, పొత్తు గురించి ఆలోచిస్తానని విశాల్ చెప్పాడు.
This post was last modified on April 15, 2024 8:36 am
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…