గత ఏడాది బలగం లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దిల్ రాజు ప్రొడక్షన్స్ కొత్త సినిమా లవ్ మీ ఇఫ్ యు డేర్ విడుదలకు సిద్ధంగా ఉంది. ముందు అఫీషియల్ గా ప్రకటించిన తేదీ ఏప్రిల్ 25. మొన్నటిదాకా ఇదే చెబుతూ వచ్చారు. కానీ రిలీజ్ ఇంకో పది రోజుల్లో పెట్టుకుని ఎక్కడ ప్రమోషన్ల ఊసు లేకపోవడం వాయిదా మీద అనుమానాలు రేపుతోంది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ది ఫ్యామిలీ స్టార్ ఫలితంతో బాగా డీలా పడిన దిల్ రాజు ఇప్పుడున్న సమయం ప్రమోషన్లకు సరిపోదని భావించి పోస్ట్ పోన్ చేసే దిశగా టీమ్ తో మాట్లాడుతున్నట్టు తెలిసింది. ఇది కాకుండా మరికొన్ని కారణాలు కనిపిస్తున్నాయి.
ఆశిష్ హీరోగా బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించిన లవ్ మీ మీద దిల్ రాజు చాలా నమ్మకం పెట్టుకున్నారు. నిర్మాతగా కూతురు హన్సితా రెడ్డికి ఇంకో హిట్టు ఖాయమనే ధీమాతో ఉన్నారు. కానీ బయట మార్కెట్ లో దీని మీద ఆశించినంత బజ్ లేదు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి స్వరపరిచిన ఆడియో ఆల్బమ్ ని మొత్తం అన్ని పాటలు కలిపి ఇటీవలే రిలీజ్ చేశారు. అయిదు రోజులు దాటుతున్నా వ్యూస్ పట్టుమని యాభై వేలు లేవు. ఇది డేంజర్ బెల్. అసలు జనాలకు ఈ సినిమా వస్తున్న సంగతే రిజిస్టర్ కాలేదని అర్థమైపోయింది. సో పబ్లిసిటీ వేగం పెంచాలి.
పైగా ఎన్నికల వేడి, ఐపీఎల్ జోరు లాంటివి జనాలను థియేటర్లకు రాకుండా అడ్డుపడుతున్నాయి. టిల్లు స్క్వేర్, హనుమాన్ లాగా బ్లాక్ బస్టర్ టాక్ వస్తే తప్ప కదలడం లేదు. అసలే లవ్ మీ రెగ్యులర్ జానర్ కాదు. దెయ్యంతో ప్రేమకథ కాన్సెప్ట్ తో ఏదో వెరైటీగా ట్రై చేశారు. పిసి శ్రీరామ్ లాంటి సుప్రసిద్ధ టెక్నీషియన్లను తెచ్చుకున్నారు. ఇంత చేసినప్పుడు పబ్లిక్ లో విపరీతమైన ఆసక్తి వచ్చేలా మేజిక్ జరగాలి. మ్యూజిక్ అంతగా సక్సెస్ కాలేదు కాబట్టి ఇకపై వదిలే వీడియో కంటెంట్ అంచనాలు పెంచేలా ఉండాలి. సో ఏప్రిల్ 25 వచ్చేది లేనిది ఇంకొక్కసారి దిల్ రాజు టీమ్ క్లియర్ గా చెప్పేస్తే బెటర్.
This post was last modified on April 15, 2024 8:25 am
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…
తెలంగాణ అసెంబ్లీలో టాలీవుడ్ కు సంబంధించి ఎప్పుడూ జరగనంత వాడి వేడి చర్చ ఇవాళ కనిపించడం ఇండస్ట్రీ వర్గాలనే కాదు…
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్.. ఇటు బీజేపీకి, అటు హిందూ సంఘాలకు కూడా.. ఐకాన్. ఆయన…