మాములుగా ఒక పెద్ద డిపార్ట్ మెంట్ స్టోర్ వెళ్లేందుకు కారణాల్లో ఒకటి ప్రత్యేక డిస్కౌంట్లు. మాములు కిరాణా షాపుల్లో రాయితీలు ఉండవు. డి మార్ట్ లాంటి బడా సంస్థల సక్సెస్ ఫార్ములా ఇదే. మెల్లగా తమ సినిమాలకు వచ్చేలా ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం నిర్మాతలు కూడా ఈ టైపు స్పెషల్ స్కీములు తీసుకురాక తప్పడం లేదు. ముఖ్యంగా ఈ వారం రిలీజైన వాటిలో మూడింటికి ఇలాంటి ప్లాన్లు అమలు చేయడం ఆశ్చర్యం కలిగించేదే. విజయ్ ఆంటోనీ లవ్ గురుకి మలేషియా, కాశ్మీర్, ఊటీ ట్రిప్పుని లక్కీ డిప్ ద్వారా తీసి గెలిచిన ఆడియన్స్ ని ఆయా ఊళ్ళకు, దేశాలకు పంపబోతున్నారు.
మూడు వందల కోట్లకు పైగా బడ్జెట్ తో తీశారని చెప్పుకున్న బడేమియా చోటేమియాకు బుక్ మై షోలో వన్ ప్లస్ వన్ ఆఫర్ పెట్టేశారు. నెగటివ్ టాక్ దెబ్బ ఆ రేంజ్ లో పడింది. అందరూ ఆహా అని మెచ్చుకున్న మైదాన్ పరిస్థితి మెరుగ్గా లేదు. విమర్శకులు మెచ్చుకున్నా థియేటర్లలో జనం లేరు. దీంతో ఇది సైతం ఒక టికెట్ కొంటె మరొకటి ఉచితం బాట పట్టక తప్పలేదు. దీని ప్రభావం రెండు సినిమాల మీద సానుకూలంగా ఉంది. ఆ మేరకు ఆదివారం బుకింగ్స్ లో పెరుగుదల ఉందని ట్రేడ్ రిపోర్ట్. ఒకవేళ ఈ ఆఫర్ ఇవ్వకపోయి ఉంటే పరిస్థితి చాలా దారుణంగా ఉండేదని బయ్యర్స్ టాక్.
రాబోయే రోజుల్లో ఈ ట్రెండ్ మరింత ఉదృతంగా కానుంది. వన్ ప్లస్ వన్ ఇవ్వడం బాలీవుడ్ లో కొత్తేమి కాదు కానీ ఫారిన్ టూర్లు గిఫ్ట్ గా అనౌన్స్ చేయడం మాత్రం టాలీవుడ్ లో గత దశాబ్ద కాలంలో ఎవరూ చేసిన దాఖలాలు లేవు. ఇదీ ఒకందుకు మంచిదే. ఎందుకంటే రాబోయే రోజుల్లో జనాలను థియేటర్లకు రప్పించడం బజ్ లేని సినిమాలకు పెద్ద సవాల్ గా మారుతోంది. ఫ్రీ టికెట్లు, డిస్కౌంట్ల మీద స్నాక్స్, గుంపుగా వస్తే ప్రత్యేక రేట్లు ఇలా ఏవో ఒకటి చేస్తూ ఉంటే తద్వారా ఆక్యుపెన్సీలను పెంచుకోవచ్చు. ఇంత చేసినా పైన చెప్పిన సినిమాల కంటే టిల్లు స్క్వేర్, మంజుమ్మల్ బాయ్స్ వసూళ్లే బాగున్నాయి.
This post was last modified on %s = human-readable time difference 8:18 am
ఏపీ సీఎం చంద్రబాబు అంటే రాష్ట్రంలోని మహిళలకు ప్రత్యేకమైన గౌరవం ఉన్న సంగతి తెలిసిందే. డ్వాక్రా సంఘాలను ఏపీ మహిళలకు…
విశాఖకు మణిహారంగా ఉన్న రుషికొండపై ప్రజాధనాన్ని వ్యర్థం చేస్తూ ప్యాలెస్ ను మాజీ సీఎం జగన్ నిర్మించుకున్న సంగతి తెలిసిందే.…
దీపావళికి టాలీవుడ్ బాక్సాఫీస్ వెలిగిపోతోంది. కన్నడ అనువాదం ‘బఘీర’ను మినహాయిస్తే మూడు సినిమాలూ బాక్సాఫీస్ దగ్గర బాగా సందడి చేస్తున్నాయి.…
ఆగస్టు 15 వీకెండ్లో ‘స్త్రీ-2’ అనే మిడ్ రేంజ్ సినిమా ఒకటి రిలీజైంది. దాంతో పాటు అక్షయ్ కుమార్ ముఖ్య…
తెలంగాణ రాజకీయాలు రసపట్టుగా మారుతున్నాయి. ఇప్పుడు రాజకీయం అంతా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీల మధ్య జరుగుతుందనుకుంటున్న తరుణంలో…
పటాసుల పండగ అయిపోయింది. బాక్సాఫీస్ మతాబులు పెద్ద శబ్దం చేస్తూ భారీ ఎత్తున ట్రేడ్ కు సంబరాలు తెచ్చిపెట్టాయి. వందల…