టిల్లు స్క్వేర్ రిలీజై 16 రోజులు అవుతోంది. మంచి టాక్ తెచ్చుకున్న సినిమాలు కూడా వారం తిరిగేసరికి బాక్సాఫీస్ దగ్గర పడకేస్తుంటాయి. సెకండ్ వీకెండ్ తర్వాత నిలబడడం కష్టమే. కానీ ఈ చిత్రం మూడో వీకెండ్లో కూడా బాక్సాఫీస్ లీడర్‌గా కొనసాగుతోంది. కొత్త చిత్రాలు దాని దూకుడు ముందు నిలవబోతున్నాయి.
ఫస్ట్ వీకెండ్ తర్వాత వీక్ డేస్‌లో కొంచె వీకైన ఈ చిత్రం.. ఆ వారం రిలీజైన ‘ఫ్యామిలీ స్టార్’ మూవీకి డివైడ్ టాక్ రాగానే పుంజుకుంది. ‘మంజుమ్మల్ బాయ్స్’ పోటీ ఇచ్చినా తట్టుకుని సెకండ్ వీకెండ్లోనే నంబర్ వన్ మూవీగా కొనసాగింది.
రెండో వీకెండ్ తర్వాత ఉగాది సెలవు వస్తే.. కొత్త చిత్రాలను మించి ఇదే బాగా ఉపయోగించుకుంది. ఆ రోజు కొత్త సినిమా తరహాలో దానికి ఫుల్స్ పడ్డాయి. ఆ తర్వాత కలెక్షన్లు కొంచెం డల్ అయ్యాయి.
కానీ వీకెండ్లో మళ్లీ ‘టిల్లు స్క్వేర్’ జోరందుకుంది. కొత్త చిత్రాల్లో ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ సహా ఏదీ పెద్దగా ప్రభావం చూపలేదు. మూడో వీకెండ్లో కూడా టిల్లు జోరుకు అడ్డే లేకపోయింది. గత 24 గంటల్లో బుక్ మై షోలో టికెట్ల అమ్మకాల్లో టాలీవుడ్ బాక్సాఫీస్ వరకు ‘టిల్లు స్క్వేర్’యే అగ్ర స్థానంలో ఉండడం విశేషం. ఒక రోజు వ్యవధిలో బీఎంఎస్‌లో 35 వేల దాకా ‘టిల్లు స్క్వేర్’ టికెట్లు అమ్ముడయ్యాయి. ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ అమ్మకాలు పాతిక వేలకు అటు ఇటుగా ఉన్నాయి.
ఇండియన్ బాక్సాఫీస్ మొత్తంలో చూస్తే ఫాహద్ ఫాజిల్ నటించిన మలయాళ మూవీ ‘ఆవేశం’ నంబర్ వన్ స్థానంలో కొనసాగుతుండడం విశేషం. అది మైదాన్, బడేమిమా చోటేమియా లాంటి భారీ బాలీవుడ్ చిత్రాలను మించి ఎక్కువ అమ్మకాలు సాగిస్తుండడం విశేషం.
This post was last modified on April 14, 2024 6:03 pm
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్‌రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…