మాములుగా పేరు ముందు డాక్టర్ రావాలంటే ఎంబిబిఎస్ చదవటం ఒక్కటే మార్గం కాదు. వేర్వేరు దారులున్నాయి. ఏదైనా రంగాన్ని ఎంచుకుని ఉన్నత విద్యలో ఒక టాపిక్ మీద పరిశోధన చేయడం ద్వారా యునివర్సిటి నుంచి అందుకోవడం మొదటిది. రెండోది ఏదైనా ఇండస్ట్రీలో పెద్ద స్థాయికి చేరుకొని కోట్లాది జనాభాలో గుర్తింపు తెచ్చుకోవడమే కాక చేస్తున్న వృత్తిలో కొత్త శిఖరాలను అందుకోవడంతో వచ్చే గుర్తింపు మరొకటి. ఆర్ఆర్ఆర్ నుంచి అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న రామ్ చరణ్ పేరు ముందు ఇక్కడ చెప్పిన రెండో క్యాటగిరీలో డాక్టర్ బిరుదు ప్రధానం జరిగింది.
చెన్నైకు చెందిన వేల్స్ విశ్వవిద్యాలయం ఈ పురస్కారం అందజేసింది. సినీ నటులకు వివిధ యునివర్సిటీలు డాక్టరేట్ అందించడం కొత్త కాదు. గతంలో మోహన్ బాబు, బ్రహ్మానందం, ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, రాజేంద్రప్రసాద్ లాంటి విశిష్ట నటీనటులు ఈ గౌరవాన్ని అందుకున్నారు. అయితే అందరికీ ఒకే యునివర్సిటీ వీటిని ప్రధానం చేయలేదు. చిరంజీవికి 2006లో ఆంధ్ర యునివర్సిటీ డాక్టరేట్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ కు పలు దఫాలు ఆఫర్లు వచ్చినా ఆయన సున్నితంగా తిరస్కరించిన సంగతి తెలిసిందే. మెగా హీరోలు ఇంకా ఎదిగే దశలో ఉండటంతో ఇంకెవరికి ఈ ఛాన్స్ రాలేదు.
ఈ డాక్టర్ అనే బిరుదు బరువుతో కూడిన బాధ్యతని చెప్పాలి. టైటిల్స్ లో ఇకపై డాక్టర్ రామ్ చరణ్ అని వేస్తారు కాబట్టి దీని మీద అవగాహన లేని వాళ్ళు ఏదేదో ఊహించుకోవడం సహజం. డిగ్రీ అఫ్ డాక్టరేట్ అఫ్ లిటరేచర్ విభాగంలో కళారంగానికి చేసిన సేవకు గాను ఇది అందించారు. పరిచయ ప్రసంగంలో చరణ్ నట ప్రయాణంతో పాటు ఆర్ఆర్ఆర్ ఆస్కార్ దాకా వెళ్లిన ఘనతను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ ప్రోగ్రాం కోసమే చెన్నై వెళ్లిన మెగా పవర్ స్టార్ దాన్ని పూర్తి చేసుకున్నారు. గేమ్ ఛేంజర్ లో ఐఏఎస్ ఆఫీసర్ గా నటిస్తున్న రామ్ చరణ్ పేరు ముందు డాక్టర్ రావడం విశేషం
This post was last modified on April 13, 2024 9:30 pm
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…
గత కొన్నేళ్లుగా మినిమమ్ హిట్ లేకుండా అభిమానులను హర్ట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి పూర్తిగా రూటు మార్చి…