ఫిలిం ఇండస్ట్రీలో హీరోయిన్లకు ఛాన్సులివ్వడంలో, అలాగే వాళ్లను ఇగ్నోర్ చేయడంలో ఒక మ్యాడ్‌నెస్ కనిపిస్తుంటుంది. కెరీర్ ఆరంభంలో ఒకట్రెండు హిట్లు పడ్డాయంటే చాలు లక్కీ ఛార్మ్ అంటూ వరుసగా ఛాన్సులిచ్చేస్తారు. పారితోషకాలు కూడా స్థాయికి మించి సమర్పించుకుంటారు. కానీ అదే హీరోయిన్‌కు వరుసగా కొన్ని ఫ్లాపులు వచ్చాయంటే చాలు.. లైట్ తీసుకుంటారు. ఐరెన్ లెగ్ ముద్ర వేసి పక్కన పెట్టేస్తారు.
కన్నడ భామ కృతి శెట్టి పరిస్థితి ఇలాగే తయారైంది. వంద కోట్ల సినిమా ‘ఉప్పెన’తో ఆమె కథానాయికగా పరిచయం అయింది. తొలి సినిమాలో క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకోవడం, సినిమా కూడా పెద్ద హిట్టవడంతో ఆమెకు అవకాశాలు వరుసకట్టాయి. తెలుగులో రెండో చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’ కూడా హిట్టవడంతో ఆమెకు డిమాండ్ పెరిగింది. చూస్తుండగానే పారితోషకం రెండు కోట్లు దాటిపోయింది.
కానీ ఎంత వేగంగా రైజ్ అయిందో అంతే వేగంగా కింద పడింది కృతి. మూడో చిత్రం ‘బంగార్రాజు’ యావరేజ్‌గా ఆడగా.. తర్వాత చేసిన వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కస్టడీ డిజాస్టర్లు అయ్యాయి. దీంతో ఆమెకు డిమాండ్ పడిపోయింది. అవకాశాలు ఆగిపోయాయి. ఏడాది పాటు తెలుగులో ఒక్క కొత్త సినిమా కూడా ఒప్పుకోలేదు కృతి.
ఈ మధ్యే శర్వానంద్ సినిమా ‘మనమే’లో ఓ కథానాయికగా ఛాన్స్ దక్కించుకుంది. తనపై ట్రెడిషనల్ హీరోయిన్ అనే ముద్ర పడడంతో గ్లామర్ ఫొటో షూట్లు చేస్తూ సెక్సీగా కనిపించడానికి కూడా సిద్ధమని చాటుతోంది కృతి. అయినా ఆమెకు ఛాన్సుల్లేవు. ఈ మధ్య పారితోషకం కూడా సగానికి సగం తగ్గించినట్లు సమాచారం. అయినా తెలుగులో అవకాశాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. తమిళంలో మాత్రం ఆమెకు రెండు సినిమాలు చేతిలో ఉన్నాయి.
This post was last modified on April 13, 2024 4:34 pm
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్‌రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…