నిన్న కొత్త రిలీజులు ఎక్కువ ఉండటంతో ఒక రోజు ఆలస్యంగా తెలుగు థియేటర్లలో అడుగు పెట్టిన సినిమా డియర్. జివి ప్రకాష్ కుమార్, ఐశ్వర్య రాజేష్ జంటగా రూపొందిన ఈ కపుల్ ఎమోషనల్ డ్రామాకు ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వం వహించాడు. గత ఏడాది ఇదే కాన్సెప్ట్ తో గుడ్ నైట్ అనే మూవీ మంచి విజయం సాధించింది. హాట్ స్టార్ లో వచ్చినపుడు చూసి మన ఆడియన్స్ కూడా పాజిటివ్ గా స్పందించారు. ఇంచుమించు అదే కథతో వచ్చిన డియర్ మీద టీమ్ గట్టి నమ్మకమే ప్రదర్శించింది. పోటీ ఎంత ఉన్నా సరైన సినిమా లేదని ఫీలవుతున్న ట్రేడ్ కి డియర్ ఊరటనిస్తుందా.
అర్జున్ (జివి ప్రకాష్ కుమార్) ది నిద్రపోయేటప్పుడు చిన్న శబ్దం వచ్చినా ఠక్కున మేలుకునే రకం. సైలెంట్ స్లీపరని పేరు. పెద్దలు చూసిన దీపిక(ఐశ్వర్య రాజేష్) ని పెళ్లి చేసుకుంటాడు. మొదటి రాత్రే తెలిసిన నిజమేమిటంటే ఆ అమ్మాయికి భయంకరమైన గురక పెట్టే అలవాటు ఉంటుంది. దీంతో వీళ్ళ కాపురంలో కలతలు మొదలవుతాయి. ఏకంగా అర్జున్ ఉద్యోగానికే ప్రమాదం తలెత్తుంది. దీంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఆ తర్వాత జరిగేది అసలు కథ. ఫస్ట్ హాఫ్ మొత్తం ఈ గురక ప్రహసనం చుట్టూ నడిపిన ఆనంద్ రవిచంద్రన్ సెకండాఫ్ లో ఎమోషన్లు లాకొచ్చాడు.
షార్ట్ ఫిలింకు సరిపోయే పాయింట్ ని తీసుకుని సినిమాగా మలచే క్రమంలో కథనాన్ని వినోదాత్మకంగా మలచలేకపోవడం డియర్ ని సాగదీసేలా చేసింది. ముఖ్యంగా ఇంటర్వెల్ తర్వాత జరిగే సన్నివేశాల్లో ఫ్యామిలీ డ్రామా డోస్ ఎక్కువైపోయి దీపికకన్నా ముందు మనకు నిద్రొస్తుంది. అర్జున్ తల్లిగా చేసిన రోహిణి, ఆమె అన్న కాళీ వెంకట్ ఎపిసోడ్ బాగానే కుదిరినా మెయిన్ ప్లాట్ కి అంతగా అతకని వ్యవహారంలా మారిపోయింది. హీరోనే కంపోజ్ చేసుకున్న పాటలు ఏ మాత్రం బాలేవు. సినిమా చూస్తూ థియేటర్ ఏసిలో నిద్రపోయే పనైతే మాత్రం డియర్ ఆ ఒక్క విషయంలో సక్సెస్ అయినట్టే.
This post was last modified on April 12, 2024 6:07 pm
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…