‘జ్ఞాపకం’ అనే సినిమాతో నటుడిగా పరిచయం అయ్యాడు వెంకీ అట్లూరి. ఆ తర్వాత అతను ‘స్నేహగీతం’ అనే మరో సినిమా కూడా చేశాడు. ఆ తర్వాత కూడా నటుడిగానే కొనసాగుతాడనుకుంటే.. ఆశ్చర్యకరంగా రైటింగ్ వైపు అడుగులు వేశాడు. ఆపై దర్శకుడూ అయిపోయాడు. ‘తొలి ప్రేమ’ అని తన తొలి చిత్రానికి పవన్ కళ్యాణ్ క్లాసిక్ మూవీ టైటిల్ పెట్టుకుంటే అతడి మీద పవర్ స్టార్ ఫ్యాన్స్ మండిపడ్డారు. కట్ చేస్తే ఈ ‘తొలి ప్రేమ’ కూడా యువ ప్రేక్షకుల మనసు దోచి ఓ ప్రత్యేక చిత్రంగా నిలిచింది.
ఈ సినిమాతో అంచనాలు పెంచిన వెంకీ అట్లూరి.. ఆ తర్వాత మిస్టర్ మజ్ను, రంగ్ దె చిత్రాలతో నిరాశపరిచాడు. తొలి సినిమా స్టయిల్లోనే ప్రథమార్ధంలో లోకల్‌గా హీరో హీరోయిన్ల గిల్లికజ్జాలతో ప్రేమకథను నడిపించి.. ద్వితీయార్ధంలో కథను ఫారిన్‌కు షిఫ్ట్ చేస్తే జనాలకు రొటీన్‌గా అనిపించింది.
దీంతో వెంకీ మీద నమ్మకం సడలింది. అతణ్ని వన్ ఫిలిం వండర్ అనేశారు. కానీ నాలుగో చిత్రంతో వెంకీ పూర్తిగా రూటు మార్చేశాడు. విలక్షణ చిత్రాలు చేసే ధనుష్‌ను ఒప్పించి ఒక సినిమా చేయడమే కాదు.. దాన్ని మంచి హిట్ కూడా చేయగలిగాడు. వీళ్ల కలయికలో వచ్చిన ‘సార్’ ఉదాత్తమైన కథాంశంతో, సామాజిక అంశాలతో హృదయాలను తాకుతూనే కమర్షియల్‌గా కూడా మెప్పించింది. వెంకీ తొలి మూడు సినిమాలు చూశాక అతడి నుంచి ఇలాంటి చిత్రాన్ని ఎవ్వరూ ఊహించలేదు. దీని తర్వాత వెంకీ ఎలాంటి సినిమా తీస్తాడా అని అందరూ ఎదురు చూశారు. ఈసారి ఇంకో కొత్త జానర్లో అడుగుపెట్టాడు వెంకీ.
క్రైమ్, ఫన్ ముడిపడ్డ కథతో తన గత సినిమాలకు పూర్తి భిన్నంగా ‘లక్కీ భాస్కర్’ను అతను తీర్చిదిద్దినట్లున్నారు. టీజర్ పూర్తిగా ప్రేక్షకులను వేరే లోకంలోకి తీసుకెళ్లింది. కాన్సెప్ట్, విజువల్స్ అన్నీ కొత్తగా అనిపించాయి. ధనుష్ లాగే దుల్కర్ లాంటి విలక్షణ నటుడిని ఒప్పించి సినిమా చేయడమే ఒక అచీవ్మెంట్. దుల్కర్ ఇమేజ్‌కు తగ్గట్లే ఇదో వైవిధ్యమైన సినిమాలా నిలిచేలా ఉంది. వెంకీ ఇలా సినిమా సినిమాకూ జానర్ మారుస్తూ, హిట్ కొడుతూ వెళ్తుంటే కొన్నేళ్లలో దర్శకుడిగా అతడికొక డిఫరెంట్ ఇమేజ్ వస్తుందనడంలో సందేహం లేదు.
This post was last modified on April 12, 2024 10:34 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…