సంక్రాంతి తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్‌లో పెద్ద స్లంప్ నడిచింది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో చాలా వారాలు సరైన సినిమాలు లేక థియేటర్లు వెలవెలబోయాయి. మార్చి చివర్లో మళ్లీ బాక్సాఫీస్‌కు ఊపొచ్చింది. ‘టిల్లు స్క్వేర్’ సినిమాతో వేసవి సీజన్ ఘనంగా ఆరంభమైంది. వీకెండ్లో కలెక్షన్ల మోత మోగించిన ఈ చిత్రం.. ఆ తర్వాత కూడా బాగానే ఆడింది. రెండో వీకెండ్లోనూ దీని జోరు కొనసాగింది.
గత వారం ‘ఫ్యామిలీ స్టార్’ కొంత సందడి చేసింది. అనువాద చిత్రం ‘మంజుమ్మల్ బాయ్స్’ కూడా బాగానే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ‘ఫ్యామిలీ స్టార్’కు మంచి టాక్ వచ్చి ఉంటే కథ వేరుండేది. అయినా సరే.. గత వీకెండ్లో ప్రేక్షకులకు మూడు ఛాయిస్‌లు ఉన్నాయి. థియేటర్లలో సందడి కనిపించింది. కానీ ఈ వారం బాక్సాఫీస్ మళ్లీ డల్ అయిపోయింది.
ఈ వారం సినిమాల మీద ప్రేక్షకుల ముందు నుంచే పెద్దగా ఆసక్తి లేదు. ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ ట్రైలర్ చూస్తేనే ఇదొక రొటీన్ హార్రర్ కామెడీ అని తేలిపోవడంతో తొలి రోజు ఈ సినిమా థియేటర్లలో జనాలు మరీ పలుచనగా కనిపించారు. టాక్ కూడా బాలేకపోవడంతో సినిమా పుంజుకుంటున్న సంకేతాలు కనిపించడం లేదు. ఇక ఈ వారం వచ్చిన మరో స్ట్రెయిట్ మూవీ ‘శ్రీరంగ నీతులు’ గురించి ప్రేక్షకులకు పట్టింపే లేదు. అనువాద చిత్రం ‘లవ్ గురు’కు కూడా స్పందన అంతంతమాత్రమే.
హిందీ చిత్రాల్లో ‘మైదాన్’కు టాక్ బాగున్నా తెలుగు రాష్టాల్లో రెస్పాన్స్ అంతంతమాత్రమే. మరో హిందీ మూవీ ‘బడేమియా చోటేమియా’కు డిజాస్టర్ టాక్ రావడంతో ఈ సినిమా వైపు కూడా జనాలు చూసే పరిస్థితి లేదు. ముందు వారాల్లో వచ్చిన టిల్లు స్క్వేర్, మంజుమ్మల్ బాయ్స్ సినిమాలే ఈ వీకెండ్లోనూ కొంత ప్రభావం చూపేలా కనిపిస్తున్నాయి.
This post was last modified on April 12, 2024 10:28 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…