బాలీవుడ్లో అందరూ హీరో ఆమిర్ ఖాన్‌ను మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అంటారు. టాలీవుడ్ విషయానికి వస్తే హీరోల కంటే ముందు దర్శకుడు రాజమౌళిని మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అని పిలవాల్సి ఉంటుంది. ఆమిర్ ఖాన్ కెరీర్లో కూడా ఫ్లాపులు, డిజాస్టర్లు లేకపోలేదు కానీ.. రాజమౌళి మాత్రం అపజయమే ఎరుగని ధీరుడు. ఇప్పటిదాకా ఆయన తీసిన సినిమాలన్నీ విజయాలందుకున్నాయి. ఇక మగధీర నుంచి ఇంతింతై అన్నట్లుగా రాజమౌళి ఎలా ఎదిగిపోతున్నాడో తెలిసిందే.
తనేం చేసినా శ్రద్ధగా.. పర్ఫెక్ట్‌గా చేయడం రాజమౌళికి అలవాటు. సినిమా తీయడమే కాదు.. బయట స్టేజ్ మీద డ్యాన్స్ చేసినా పర్ఫెక్ట్‌గా ఉంటుందని ఇటీవలే జనాలకు చాటి చెప్పారాయన. ఓ ఫ్యామిలీ ఫంక్షన్ సందర్భంగా రాజమౌళి స్టేజ్ మీద డ్యాన్స్ చేసిన వీడియో వారం కిందట వైరల్ అయిన సంగతి తెలిసిందే.
తన భార్య రమ రాజమౌళితో కలిసి ‘ప్రేమికుడు’ సినిమాలోని ‘అందమైన ప్రేమరాణి..’ పాటకు రాజమౌళి అదిరిపోయే రేంజిలో స్టెప్స్ వేశారు. ఐతే రాజమౌళి అప్పటికప్పుడు అంత పర్ఫెక్ట్‌గా స్టెప్స్ ఎలా వేశారా అని అందరూ ఆశ్చర్యపోయారు. ఐతే అసలు విషయం ఏంటంటే.. ఇందుకోసం జక్కన్న ముందే రిహార్సల్స్ కూడా చేశాడు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు బయటికి వచ్చింది.
తన భార్యతో పాటు కొందరు డ్యాన్సర్లతో కలిసి ఆయన ఈ పాటకు స్టెప్స్ ప్రాక్టీస్ చేస్తున్నారీ వీడియోలో. సరదాగా స్టేజ్ మీద డ్యాన్స్ చేసినా కూడా అది పర్ఫెక్ట్‌గా ఉండాలన్న ఉద్దేశంతో దాని కోసం కూడా రిహార్సల్స్ చేయడం జక్కన్న కమిట్మెంట్‌కు నిదర్శనం అని.. ఆయన ఏం చేసినా ఇలాగే పర్ఫెక్ట్‌గా, శ్రద్ధంగా చేస్తారని అభిమానులు కొనియాడుతున్నారీ వీడియో చూసి.
This post was last modified on April 11, 2024 11:48 am
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. నోబెల్ ప్రపంచ శాంతి పురస్కారం కోసం వేయి కళ్లతో ఎదురు చూసిన విషయం తెలిసిందే.…