తెలుగులో అవకాశాలు తగ్గిపోయిన ఒకప్పటి స్టార్ హీరోయిన్లు తమన్నా, రాశి ఖన్నా ఇప్పుడు తమిళంలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీళ్లిద్దరూ కలిసి చేసిన తమిళ సినిమా.. ఆరణ్మయి-4. తమిళ సీనియర్ దర్శకుడు సుందర్.సి రూపొందించిన చిత్రమిది. ఆయన దాదాపు దశాబ్ద కాలం నుంచి హార్రర్ కామెడీ జానర్లో ఆరణ్మయి, ఆరణ్మయి-2, ఆరణ్మయి-3.. ఇలా సినిమాలు తీస్తూ వస్తున్నారు. అవి ఓ మోస్తరుగా ఆడి వెళ్లిపోతున్నాయి. ఈసారి కూడా ఆయన ఆరణ్మయి ఫ్రాంఛైజీనే నమ్ముకుని ఇంకో సినిమా తీశారు.
పార్ట్-3లో కథానాయికగా నటించిన రాశి ఖన్నాను కొనసాగిస్తూ.. ఈసారి మరో గ్లామర్ క్వీన్ తమన్నాను కూడా ఈ సినిమాలోకి తీసుకొచ్చారు. ఈ నెల 26న ఆరణ్మయి-4 ప్రేక్షకుల ముందుకు రానుంది.
తమన్నా, రాశి తెలుగులో కూడా బాగానే పాపులర్ కాబట్టి ఈ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేయబోతున్నారు. ఏషియన్ మూవీస్ సంస్థ హక్కులు తీసుకుంది. ఈ చిత్రానికి తెలుగులో బాక్ అని చిత్రమైన టైటిల్ ఏదో పెట్టారు. దానికి అర్థమేంటో సినిమా చూస్తే కానీ తెలియదేమో. ఈ మధ్య తమిళ అనువాద చిత్రాలకు తమిళ టైటిళ్లే పెట్టి వదిలేస్తున్నారు. అలా కాకుండా ఏదో కొత్త టైటిల్ పెట్టినందుకు సంతోషించాల్సిందే.
ఆరణ్మయి మూడు పార్టుల్లోనూ వేరే హీరోలను పెట్టి తాను కీలక పాత్రలు పోషించిన సుందర్.. ఈ చిత్రంలో తనే హీరోగా నటించడం విశేషం. ఈ చిత్రంలో తెలుగు కమెడియన్ వెన్నెల కిషోర్ కూడా ఒక పాత్రలో కనిపించనున్నాడు. మిగతా తమిళ ఆర్టిస్టుల్లో కూడా కొందరు మనవాళ్లకు తెలిసిన వాళ్లే. హిప్‌హాప్ తమిళ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
This post was last modified on April 11, 2024 10:07 am
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…